Share News

How SIP Can Help: రూ 5 కోట్ల నిధి @50

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:12 AM

ఎంత అక్షరాస్యులైనా మన దేశంలో చాలా మందికి ఆర్థిక అక్షరాస్యత లేదు. దీంతో మంచి ఉద్యోగం, ఆర్థిక స్థోమత ఉన్నా జీవితం చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు అనుభవిస్తుంటారు. నాలుగు రాళ్లు సంపాదించేటప్పుడే...

How SIP Can Help: రూ 5 కోట్ల నిధి @50

సిప్‌ ద్వారా రిటైర్మెంట్‌ ప్లానింగ్‌తో సాధ్యమే..

ఎంత అక్షరాస్యులైనా మన దేశంలో చాలా మందికి ఆర్థిక అక్షరాస్యత లేదు. దీంతో మంచి ఉద్యోగం, ఆర్థిక స్థోమత ఉన్నా జీవితం చివరి దశలో ఆర్థికంగా ఇబ్బందులు అనుభవిస్తుంటారు. నాలుగు రాళ్లు సంపాదించేటప్పుడే క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (సిప్‌) పద్దతిలో రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేసుకుంటే ఈ తిప్పలు ఉండవు. 25 ఏళ్ల వయసులో చక్కటి పెట్టుబడి ప్రణాళిక, ఓర్పు ఉంటే 50 ఏళ్ల వయసు వచ్చే సరికి సిప్‌ ద్వారా రూ.5 కోట్లు వెనుకేసుకోవచ్చు. ఎలాగంటే?

సిప్‌ పెట్టుబడులు

మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎ్‌ఫ)లో మదుపు చేసే వారికి సిప్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెలనెలా మీ ఆదాయానికి తగ్గట్టు ఈ పద్దతిలో కొంత నిర్ణీత మొత్తాన్ని ఆయా పథకాల్లో మదుపు చేస్తూ పోవాలి. పెరిగే ఆదాయానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్నీ పెంచుకోవచ్చు. నెలనెలా రూ.10,000 పెట్టుబడితో 25 ఏళ్ల వ్యక్తి సిప్‌ పద్దతిలో మంచి ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులు ప్రారంభించాలి. అప్పుడే చిరుద్యోగాల్లో చేరిన వారికి ఇది కొద్దిగా భారంగానే ఉంటుంది. దుబారా ఖర్చులు, జీవన శైలి మార్పుల ద్వారా ఈ మొత్తాన్ని నెలనెలా సిప్‌ పద్దతిలో పెట్టుబడిగా పెట్టడం చాలా మందికి ముఖ్యంగా వృత్తి నిపుణులకు పెద్ద కష్టమేమీ కాక పోవచ్చు. జీతాలు పెరిగినపుడల్లా ఈ సిప్‌ పెట్టుబడులను 10 శాతం పెంచుకోవాలి. ఇలా పెరిగిన జీతం లేదా ఆదాయాలకు అనుగుణంగా సిప్‌ పెట్టుబడులు పెంచుకుంటూ పోతే దీర్ఘకాలంలో ఆ మొత్తమే మీ పెట్టుబడులను మరింత పెంచుతాయి. వాల్యూ రీసెర్చ్‌ సంస్థ సర్వే ప్రకారం గత 20 ఏళ్లలో మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని 36 పథకాలు ఏటా సగటున 15 శాతానికి పైగా రాబడులు ఇచ్చాయి.


వడ్డీ మీద వడ్డీ

సిప్‌ పద్దతిలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి మీద ఏటికేటికి వడ్డీ జమ అవుతుంది. ఇలా రూ.10,000తో ప్రారంభించి ఏటా క్రమం తప్పకుండా సిప్‌ పెంచుకుంటూ పోతే పాతికేళ్లు అయ్యే సరికి రూ.5 కోట్ల మూలనిధి సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈక్విటీ మార్కెట్‌ మధ్యలో ఎన్ని ఆటుపోట్లకు లోనైనా పాతికేళ్ల దీర్ఘకాలానికి చూస్తే మంచి రాబడులే ఇస్తుందని చరిత్ర చెబుతున్న సత్యం.

రిస్క్‌ వద్దనుకుంటే?

మార్కెట్‌ ఆటుపోట్లను ఏ మాత్రం తట్టుకోలేమనుకుంటే బులియన్‌ మార్కెట్‌ను ఎంచుకోవచ్చు. అసలు ఈ గోల అంతా ఎందుకనుకుంటే ఎంఎ్‌ఫలు అందించే మల్టీ అసెట్‌ ఫండ్స్‌ సిప్‌ను ఎంచుకోవడం మంచిది. ఈ ఫండ్స్‌ మదుపరుల నుంచి సమీకరించిన నిధులను లోతైన పరిశోధన ద్వారా మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, బులియన్‌, రుణ పత్రాల మార్కెట్లలో మదుపు చేస్తాయి. గత రెండు మూడేళ్లుగా ఈ ఫండ్స్‌ కూడా పెద్దగా రిస్క్‌ లేకుండా మదుపరులకు మంచి రాబడులు పంచాయి. కొద్దిగా రిస్క్‌ తీసుకోగలిగితే సిప్‌ పద్దతిలో బ్లూచిప్‌ కంపెనీల షేర్లలోనూ మదుపు చేయవచ్చు. అయితే ఈ మదుపరులు ఎప్పటికప్పుడు మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తుండాలి. లేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

రూ.5 కోట్లు ఎలా?

  • నెలవారీ సిప్‌ రూ.10,000

  • సగటు రాబడి

  • అంచనా 10 శాతం

  • పాతికేళ్లలో వార్షిక సగటు రాబడి 15 శాతం

  • పెట్టుబడుల కాల పరిమితి 25 సంవత్సరాలు

  • తొలి ఏడాది నెలకు రూ.10,000 చొప్పున ఏడాదికి రూ.1.2 లక్షలు

25 ఏళ్లకు సమకూరే మొత్తం

  • రెండో ఏడాది నెలకు రూ.11,000 చొప్పున ఏడాదికి రూ.1.32 లక్షలు

  • మూడో సంవత్సరం నెలకు రూ.12,100 చొప్పున ఏడాదికి రూ.1,45,200

  • పాతికేళ్లలో మొత్తం పెట్టుబడి సుమారు రూ.1.18 కోట్లు

  • పాతికేళ్లకు (50 ఏళ్ల వయసు వచ్చే సరికి) సమకూరే మొత్తం రూ.4.54 కోట్లు

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 06:12 AM