Honda Motorcycles: కొత్త మోడళ్లతో మార్కెట్లో పట్టు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:26 AM
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకునేందుకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఏంఎ్‌సఐ) ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కంపెనీ వాటా...
హోండా మోటార్స్
కోల్‌కతా: దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకునేందుకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఏంఎ్‌సఐ) ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కంపెనీ వాటా 28 శాతంగా ఉందని, కొత్త మోడళ్ల విడుదల ద్వారా ఈ వాటాను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్‌ఎంఎ్‌సఐ డైరెక్టర్ యోగేశ్ మాథుర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 100సీసీ, 125సీసీ విభాగంలో కొత్తగా రెండు బైక్స్‌ను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.
మార్కెట్లోకి సీబీ 125 హార్నెట్: హైదరాబాద్ మార్కెట్లోకి సరికొత్త హోండా సీబీ125 హార్నెట్, షైన్ 100డీఎక్స్ మోటార్‌సైకిళ్లను హెచ్‌ఎంఎ్‌సఐ జోనల్ హెడ్ సునీల్ రెడ్డి విడుదల చేశారు. హోండా హార్నెట్ ధర రూ.1,25,000, షైన్ 100డీఎక్స్ ధర రూ.75,950 (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి