Shipyard Receives Mini Navratna Status: హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు మినీ నవరత్నహోదా
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:15 AM
విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎ్‌సఎల్)కు మంగళవారం ప్రతిష్టాత్మకమైన మినీ నవరత్న హోదా లభించింది. 1941లో ఏర్పాటైన షిప్‌యార్డు...
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్‌ఎ్‌సఎల్)కు మంగళవారం ప్రతిష్టాత్మకమైన మినీ నవరత్న హోదా లభించింది. 1941లో ఏర్పాటైన షిప్‌యార్డు భారత నౌకాదళానికి అవసరమైన నౌకలతో పాటు వాణిజ్య నౌకలను కూడా తయారుచేయడంలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఒకానొక దశలో ప్రైవేట్ షిప్‌యార్డ్‌ల పోటీని తట్టుకొని ఆర్డర్లు సాధించలేక నష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థికంగా నిలబెట్టడానికి, వర్క్ ఆర్డర్లు అందించడానికి వీలుగా 2010లో రక్షణ మంత్రిత్వ శాఖకు సంస్థను బదిలీ చేశారు. కేంద్రం మద్దతు లభించినా ఐదేళ్లు అవే సమస్యలు వెంటాడాయి. ఆ తర్వాత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడంతో 2015 నుంచి లాభాల బాట పట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News