Share News

Hetero Launches New Cancer Drug: హెటెరో నుంచి క్యాన్సర్‌ ఔషధం

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:02 AM

హెటెరో హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ మరో సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ‘పెర్జియా’ పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం రొమ్ము క్యాన్స...

Hetero Launches New Cancer Drug: హెటెరో  నుంచి  క్యాన్సర్‌  ఔషధం

హైదరాబాద్‌: హెటెరో హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ మరో సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ‘పెర్జియా’ పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో ఉపయోగపడుతుందని తెలిపింది. ఆల్కెమ్‌ లేబొరేటరీస్‌ అనుబంధ బయోటెక్నాలజీ సంస్థ ఎంజీన్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు హెటెరో వెల్లడించింది. అంకాలజీ థెరపీల్లో నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరల్లో తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ ఔషధాన్ని తీసుకువచ్చినట్లు హెటెరో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 03:39 PM