Share News

HCA Healthcare: హైదరాబాద్‌లో హెచ్‌సీఏ జీసీసీ

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:33 AM

హైదరాబాద్‌లో మరో ప్రముఖ అమెరికా కంపెనీ కొలువు తీరింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో 195 ఆస్పత్రులు, 2500 కేర్‌ సెంటర్ల ద్వారా...

HCA Healthcare: హైదరాబాద్‌లో హెచ్‌సీఏ జీసీసీ

  • 3,000 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో ప్రముఖ అమెరికా కంపెనీ కొలువు తీరింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో 195 ఆస్పత్రులు, 2500 కేర్‌ సెంటర్ల ద్వారా వైద్య సేవలందిస్తున్న ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌’ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేసింది. సత్వా నాలెడ్జ్‌ పార్కులో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ ఏడాది చివరికి ఈ జీసీసీ కోసం 7.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.665.25 కోట్లు) ఖర్చు చేయనున్నట్టు హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ కేపబిలిటీ నెట్‌వర్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎమిలీ డంకన్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 1100 మంది పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్య 3,000కు పెరగనుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 25 , 2025 | 03:33 AM