Share News

H 1B Visa Fee Hike: హెచ్‌ 1బీ వీసాల ఫీజులపై బేఫికర్‌

ABN , Publish Date - Sep 26 , 2025 | 05:47 AM

హెచ్‌-1బీ వీసాల ఫీజును డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు లక్ష డాలర్లకు పెంచిన ప్రభావం, భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండదని దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌’ వెల్లడించింది....

H 1B Visa Fee Hike: హెచ్‌ 1బీ వీసాల ఫీజులపై బేఫికర్‌

క్లయింట్లపైనే 30-70 శాతం భారం

కంపెనీల లాభాలకూ ఢోకా ఉండదు: క్రిసిల్‌

న్యూఢిల్లీ: హెచ్‌-1బీ వీసాల ఫీజును డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు లక్ష డాలర్లకు పెంచిన ప్రభావం, భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండదని దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌’ వెల్లడించింది. భారత ఐటీ సర్వీస్‌ కంపెనీలు ట్రంప్‌ పెంచిన వీసా ఫీజులో 30 నుంచి 70 శాతం భారాన్ని అమెరికా క్లయింట్లకే బదిలీ చేసే అవకాశం ఉన్నందున, వాటి నిర్వహణ లాభాలపైనా ఈ పెంపు ప్రభావం పెద్దగా ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీల నిర్వహణ లాభాలు గత ఏడాదితో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం మహా అయితే 10-20 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు ఒక్కో హెచ్‌-1బీ వీసాపై 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లు ఫీజుగా వసూలు చేసింది. ఈ నెల 21 నుంచి ఈ మొత్తాన్ని లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఐటీ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో క్రిసిల్‌ ఈ నివేదిక విడుదల చేయడం విశేషం. నివేదిక ప్రధానాంశాలు..

  • గత ఆర్థిక సంవత్సరం భారత ఐటీ కంపెనీల విదేశీ ఆదాయంలో అమెరికా వాటా 53 శాతం

  • వీసాల ఫీజు పెంచినా ఈ ఆదాయానికి పెద్దగా ఢోకా ఉండకపోవచ్చు

  • ప్రస్తుతం అమెరికాలోని భారత ఐటీ కంపెనీల ఉద్యోగుల జీతభత్యాల్లో హెచ్‌-1బీ వీసాల ఫీజు భారం శాతం 0.02-0.05 శాతం మాత్రమే

  • హెచ్‌-1బీ వీసాల ఉద్యోగులు 35 శాతం వద్ద స్థిరంగా ఉన్నా, వచ్చే ఆర్థిక సంవత్సరం జీతాల ఖర్చులో వీసాల ఫీజు భారం ఒక శాతం మించుతుంది

  • హెచ్‌-1బీ వీసాల ఉద్యోగులు 35 శాతాని కంటే తగ్గితే, ఫీజుల భారం 0.3-0.6 శాతం వరకు ఉండే అవకాశం

  • హెచ్‌-1బీ ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటున్న భారత ఐటీ కంపెనీలు

  • 2017-25 మధ్య ఏటా సగటున 9 శాతం చొప్పున తగ్గిన హెచ్‌-1బీ ఉద్యోగులు

  • హెచ్‌-1బీ వీసాల తిరస్కరణ రేటు పెరగడంతో నియర్‌షోర్‌ కేంద్రాలు, స్థానికుల నియామకంపై దృష్టి పెట్టిన భారత ఐటీ కంపెనీలు

  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఐటీ కంపెనీలపై ఫీజుల పెంపు ప్రభావం

ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 05:47 AM