Share News

GST on warranty repairs: వారంటీలో ఉన్న వస్తువులు రిపేర్‌కు వస్తే

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:25 AM

సాధారణంగా మొబైల్‌, టీవీ, ఫ్రిడ్జ్‌ లాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు కానీ, కారు, బైక్‌ లాంటి ఆటోమొబైల్స్‌ లేదా ఇతర యంత్ర పరికరాలు ‘వారంటీ’లో విక్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేసిన వస్తువులు వారంటీ గడువు లోపు...

GST on warranty repairs: వారంటీలో ఉన్న వస్తువులు రిపేర్‌కు వస్తే

సాధారణంగా మొబైల్‌, టీవీ, ఫ్రిడ్జ్‌ లాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు కానీ, కారు, బైక్‌ లాంటి ఆటోమొబైల్స్‌ లేదా ఇతర యంత్ర పరికరాలు ‘వారంటీ’లో విక్రయిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేసిన వస్తువులు వారంటీ గడువు లోపు పాడయినట్లయితే డిస్ట్రిబ్యూటర్‌ లేదా సర్వీస్‌ సెంటర్లలో ఆయా వస్తువులకు ఉచితంగా మరమ్మతులు చేయటం, అవసరమైతే పాడయిన విడిభాగాలను ఉచితంగా మార్చటం వంటివి చేస్తుంటారు. అయితే ఆయా విడిభాగాల మీద సంబంధిత ఉత్పత్తిదారుడు (కంపెనీ) గానీ, సర్వీస్‌ సెంటర్‌ గానీ జీఎ్‌సటీ కట్టాల్సి ఉంటుందా? లేదంటే ఆయా విడిభాగాలకు సంబంధించిన ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను రివర్స్‌ చేయాల్సి ఉంటుందా? అలాగే సర్వీస్‌ సెంటర్‌కు, ఉత్పత్తిదారుడికి మధ్య జరిగే లావాదేవీల మీద జీఎ్‌సటీ ఎలా చెల్లించాలి? కస్టమర్‌ దగ్గర నుంచి అదనంగా ఏమైనా వసూలు చేస్తే దాన్ని ఎలా చూపాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం.

ఈ వారంటీకి సంబంధించిన రిపేర్లు రెండు రకాలుగా ఉంటాయి. కంపెనీనే రిపేర్లు చేపట్టటం లేదా ఆయా కంపెనీల తరపున సంబంధిత డిస్ట్రిబ్యూటర్లు లేదా సర్వీస్‌ సెంటర్లు ఈ రిపేర్లు చేపట్టటం. ఈ రెండు సందర్భాల్లోనూ ఏవేనీ విడిభాగాలను ఉచితంగా మార్చటం జరుగుతుంటే ఆ విడిభాగాల మీద ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. అలాగే ఆయా విడిభాగాల మీద తీసుకున్న ఐటీసీని కూడా రివర్చ్‌ చేయనవసరం లేదు. కాకపోతే, కస్టమర్‌ నుంచి ఏమైనా సర్వీస్‌ చార్జీ కింద లేదా ఇతర కారణాలతో అదనపు రుసుము వసూలు చేస్తే దాని మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.


అయితే కంపెనీల తరపున డిస్ట్రిబ్యూటర్‌ లేదా సర్వీస్‌ సెంటర్లలో రిపేర్లు జరుగుతుంటే సంబంధిత డిస్ట్రిబ్యూటర్‌కు, ఆయా కంపెనీల మధ్య లావాదేవీలను ఎలా అర్ధం చేసుకోవాలి? ఇందులో కూడా వివిధ రకాల లావాదేవీలు ఉంటాయి. మొదటిది, ఏదేనీ విడిభాగాలను మార్చాల్సి వస్తే.. డిస్ట్రిబ్యూటర్‌, సంబంధిత కంపెనీకి ఇండెంట్‌ పెట్టి ఆయా విడిభాగాలను ఉచితంగా తెప్పించుకుంటారు. అలాంటి సందర్భంలోనూ సంబంధిత కంపెనీ ఆ విడిభాగాల మీద కూడా ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. ఆయా విడిభాగాలకు సంబంధించి ఎలాంటి ఐటీసి కూడా రివర్స్‌ చేయాల్సిన అవసరం లేదు. అలాకాకుండా డిస్ట్రిబ్యూటర్‌ తన దగ్గర ఉన్న విడిభాగాలను లేదా బయట నుంచి కొనుగోలు చేసిన విడిభాగాలను వాడి కంపెనీకి బిల్లు (ఇన్వాయిస్‌) పెట్టినట్లయితే, ఆ బిల్లు మీద సంబంధిత డిస్ర్టిబ్యూటర్‌ జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అలా చెల్లించిన జీఎ్‌సటీని నియమ నిబంధనలకు లోబడి కంపెనీలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కింద తీసుకోవచ్చు.

అలాగే డిస్ట్రిబ్యూటర్‌ లేదా సర్వీస్‌ సెంటర్‌ సర్వీస్‌ చార్జీల కింద ఏదేనీ రుసుమును కంపెనీ నుంచి వసూలు చేస్తే దాని మీద కూడా జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ జీఎ్‌సటీని పైన తెలిపినట్లు ఆయా కంపెనీలు ఐటీసి తీసుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే పైన చెప్పిన లావాదేవీలు ఉచితంగా అందించినంత వరకు ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో కంపెనీలు ఈ లావాదేవీలకు సంబంధించి క్రెడిట్‌ నోట్స్‌ను డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇవ్వటం జరుగుతుంది. అలాంటప్పుడు క్రెడిట్‌ నోట్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఇరువైపుల పాటించాల్సి ఉంటుంది.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 04:25 AM