Share News

25 వరకు జీ‌ఎస్‌టీఆర్‌ 3బీ రిటర్నుల గడువు

ABN , Publish Date - Oct 20 , 2025 | 01:44 AM

పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం జీ‌ఎస్‌టీఆర్‌-3బీ పన్ను రిటర్న్‌ దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగించింది.

25 వరకు జీ‌ఎస్‌టీఆర్‌ 3బీ రిటర్నుల గడువు

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగిస్తూ ప్రభుత్వం జీ‌ఎస్‌టీఆర్‌-3బీ పన్ను రిటర్న్‌ దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగించింది. సెప్టెంబర్‌ నెల, జూలై- సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించిన జీ‌ఎస్‌టీఆర్‌-3బీ రిటర్నులను పన్ను చెల్లింపుదారులు ఈ నెల 25వ తేదీలోగా సమర్పించవచ్చని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) తెలిపింది. సాధారణం గా ప్రతి నెల 20, 22, 24 తేదీల్లో వర్గాల వారీగా పన్ను చెల్లింపుదారులు ఈ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 01:44 AM