Share News

GST Reduction Sparks Surge: కార్ల షోరూమ్‌లు కళ కళ

ABN , Publish Date - Sep 23 , 2025 | 06:14 AM

వాహనాలపై జీఎ్‌సటీ తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి రావడంతో కార్ల షోరూమ్‌లు కొత్త కళను సంతరించుకున్నాయి. నవరాత్రుల తొలిరోజున తమ కార్ల రిటైల్‌ విక్రయాలు 25,000-30,000 మించవచ్చని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తెలిపింది...

GST Reduction Sparks Surge: కార్ల షోరూమ్‌లు కళ కళ

జీఎస్‌టీ తగ్గడంతో పోటెత్తిన కస్టమర్లు

మారుతి, హ్యుండయ్‌ రికార్డు డెలివరీలు.. 50% పెరిగిన చిన్న కార్ల బుకింగ్‌లు

న్యూఢిల్లీ: వాహనాలపై జీఎ్‌సటీ తగ్గింపు సోమవారం నుంచి అమలులోకి రావడంతో కార్ల షోరూమ్‌లు కొత్త కళను సంతరించుకున్నాయి. నవరాత్రుల తొలిరోజున తమ కార్ల రిటైల్‌ విక్రయాలు 25,000-30,000 మించవచ్చని దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) తెలిపింది. కస్టమర్ల తాకిడితో షోరూమ్‌లు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాల్సి వచ్చిందని మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ పార్థో బెనర్జీ తెలిపారు. కంపెనీ డీలర్‌షి్‌పలకు ఒక్కరోజే 80,000 కస్టమర్ల ఎంక్వైరీలు వచ్చాయన్నారు. జీఎ్‌సటీ తగ్గుదలతో చిన్న కార్ల బుకింగ్స్‌ 50 శాతం పెరిగాయన్నారు. కొన్ని మోడళ్ల వేరియంట్లకు అధిక గిరాకీ నెలకొనడంతో నిల్వలు నిండుకోవచ్చన్నారు. విక్రయాలపరంగా కంపెనీకిదే అత్యుత్తమ రోజని బెనర్జీ పేర్కొన్నారు.

నవరాత్రుల ఆరంభానికి జీఎ్‌సటీ తగ్గుదల తోడవడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ అత్యంత సానుకూలంగా మారిందని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా సీఓఓ తరుణ్‌ గార్గ్‌ అన్నారు. జీఎ్‌సటీ తగ్గిన తొలి రోజే తమ డీలర్లు 11,000 కార్లను విక్రయించారని, గడిచిన ఐదేళ్లలో కంపెనీకిదే అత్యధిక ఒక్కరోజు అమ్మకాలని ఆయన తెలిపారు. కొత్త కార్ల కొనుగోలు కోసం షోరూమ్‌లకు కస్టమర్ల తాకిడి భారీగా పెరిగిందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) అధ్యక్షులు సీఎస్‌ విజ్ఞేశ్వర్‌ తెలిపారు.


‘‘గడిచిన 3-4 వారాలుగా కస్టమర్ల ఎంక్వైరీలు అనూహ్యంగా పెరిగాయి. దుర్గ నవరాత్రుల తొలి రోజుల విక్రయాలు భారీగా పుంజుకోనున్నాయని’’ ఆయన పేర్కొన్నారు.

సెకండ్‌ హ్యాండ్‌ కార్లకూ భలే గిరాకీ

యూజ్డ్‌ కార్ల విక్రయాలూ అనూహ్యంగా పెరిగాయని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కార్స్‌24’ తెలిపింది. రోజువారీ సగటుతో పోలిస్తే, సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కార్ల డెలివరీలు ఏకంగా 400 శాతం పెరిగాయని తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అధిక విక్రయాలు నమోదయ్యాయని.. అహ్మదాబాద్‌, బెంగళూరు, పుణె, ముంబై ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయంది. అలాగే, తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కారును విక్రయించాలనుకునే సంఖ్య కూడా భారీగా పెరిగిందని కార్స్‌24 వెల్లడించింది. ఒక్కరోజులో 5,000 వాహనాల తనిఖీలు జరిపామని, గడిచిన నాలుగేళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.

1-Business.jpg

ఏసీ, టీవీ సేల్స్‌ జూమ్‌

జీఎ్‌సటీ తగ్గింపుతో నవరాత్రుల తొలిరోజున ఎయిర్‌ కండీషనర్లు (ఏసీ), టెలివిజన్‌ (టీవీ) అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. విక్రేతల చౌక డీల్స్‌ను అందిపుచ్చుకునేందుకు కొనుగోలుదారులు ఎగబడ్డారు. ఇతర సోమవారాలతో పోలిస్తే, 22న రెట్టింపు విక్రయాలు జరిపినట్లు హాయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎన్‌ఎ్‌స సతీశ్‌ తెలిపారు. జీఎ్‌సటీ తగ్గింపునకు ముందే ఈ కంపెనీ ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు నమోదైన ఎంక్వైరీలను బట్టి చూస్తే, విక్రయాలు భారీగా పెరగనున్నాయని బ్లూస్టార్‌ ఎండీ త్యాగరాజన్‌ అన్నారు. గత ఏడాది సెప్టెంబరు అమ్మకాలతో పోలిస్తే ఈ నెలలో 20 శాతం వృద్ధి నమోదు కావచ్చని ఆయన అంచనా వేశారు. జీఎ్‌సటీ తగ్గిన తొలి రోజున విక్రయాలు 30-35 శాతం పెరిగాయని థాంప్సన్‌, కొడాక్‌ వంటి టీవీ బ్రాండ్ల లైసెన్సులు కలిగిన సూపర్‌ ప్లాస్ట్రోనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా అన్నారు.


పునరుత్పాదక ఇంధన రంగ ఇన్వెస్టర్లకు

రూ.1.50 లక్షల కోట్ల ఆదా

పునరుత్పాదక ఇంధనంపై జీఎ్‌సటీ తగ్గడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి 2030 నాటికి రూ.1.50 లక్షల కోట్ల వరకు ఆదా కావచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ప్రభుత్వం రెన్యువబుల్‌ ఎనర్జీ పరికరాలపై జీఎ్‌సటీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. కాగా, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 300 గిగావాట్ల మేర పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. జీఎ్‌సటీ తగ్గింపుతో ఇన్వెస్టర్లకు వ్యయం 2-3 శాతం మేర తగ్గినా రూ.1-1.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ఆదా కావచ్చని పేర్కొన్నారు. జీఎ్‌సటీ తగ్గింపుతో పీఎం సూర్య ఘర్‌ పథకం కింద లభించే రూఫ్‌ టాప్‌ సోలార్‌ 3 కిలోవాట్‌ సిస్టమ్‌ ధర రూ.9,000-10,500 మేర తగ్గనుంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 23 , 2025 | 06:14 AM