GST Council 2025: నేటి నుంచి జీఎస్‌టీ మండలి భేటీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:08 AM
జీఎస్‌టీ మలి తరం సంస్కరణలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి....
గురువారం తుది నిర్ణయం
రెండు శ్లాబులపై నిర్ణయం .. లగ్జరీ ఈవీలపై బాదుడు!
న్యూఢిల్లీ: జీఎస్‌టీ మలి తరం సంస్కరణలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేసి పారద్శకతను పెంచేలా ఉంటాయని సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల చిన్న వ్యాపార సంస్థలపై నిబంధనల అమలు భారం తగ్గడంతో పాటు అనేక వస్తువులఽ ధరలు తగ్గుతాయన్నారు. ప్రతిపాదిత సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎ్‌సటీ రేట్లను 5,18 శ్లాబులుగా కుదించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో నిత్యావసరాలతో పాటు గృహోపకరణ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
విలాస కార్లపై బాదుడే: ఎంట్రీ లెవల్ కార్లు, ద్విచక్ర మోటారు వాహనాలపై ప్రస్తుతం 28 శాతం జీఎ్‌సటీ అమలవుతోంది. విలాస కార్లపై మాత్రం 28 శాతం జీఎ్‌సటీతో పాటు మరో 28 శాతం ప్రత్యేక సెస్సు అమలవుతోంది. ప్రతిపాదిత సంస్కరణల్లో భాగంగా ఎంట్రీ లెవల్ కార్లు, టూ వీలర్లపై జీఎ్‌సటీని ప్రస్తుత 28 శాతం నుంచి 18 శాతానికి కుదించాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన మంత్రుల బృందం ఇప్పటికే సిఫారసు చేసింది. అయితే లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలను మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే 40 శాతం శ్లాబులో చేర్చాలని సూచించింది. రూ.40 లక్షలకు మించిన ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ)ను ఈ జాబితాలో చేర్చాలని కోరింది. జీఎ్‌సటీ మండలి ఇందుకు ఆమోదం తెలిపితే టెస్లాతో పాటు లగ్జరీ ఈవీల బాట పట్టిన బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్ కంపెనీలకు తిప్పలు తప్పవని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి