Share News

GST 2025 Reforms: వ్యాపారులు ఇవి తెలుసుకోండి

ABN , Publish Date - Sep 21 , 2025 | 05:18 AM

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎ్‌సటీ 2.0 సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. గూడ్స్‌, సర్వీసె్‌సకు సంబంధించి ఇప్పటికే తగ్గించిన రేట్లకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయటం జరిగింది. అంతేకాదు...

GST 2025 Reforms: వ్యాపారులు ఇవి తెలుసుకోండి

జీఎ్‌సటీ 2.0..

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎ్‌సటీ 2.0 సంస్కరణలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. గూడ్స్‌, సర్వీసె్‌సకు సంబంధించి ఇప్పటికే తగ్గించిన రేట్లకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేయటం జరిగింది. అంతేకాదు పన్ను తగ్గింపు ప్రయోజనాలను కచ్చితంగా వినియోగదారులకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు పాటించాల్సిన నియమ నిబంధనలేమిటో చూద్దాం.

మొదటిది, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కి సంబంధించినది. ఇంతకు ముందు 28 శాతంలో ఉన్న వస్తువులను 18 శాతానికి, 12 శాతంలో ఉన్న వస్తువులు 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే సెప్టెంబరు 21 నాటికి ఉన్న స్టాక్‌ మీద ఎక్కువ శాతంలో ఐటీసీ తీసుకోవటం జరిగింది. అంటే 28 శాతం లేదా 12 శాతంలో. అలాంటప్పుడు రేటు తగ్గిన మేరకు ఐటీసీని రివర్స్‌ చేయాల్సిన అవసరం ఉందా? జీఎ్‌సటీ నిబంధనల మేరకు ఒక సరఫరా మీద పన్ను చెల్లిస్తున్నప్పుడు ఐటీసీకి అర్హులు. దీనికి పన్ను శాతానికి సంబంధం లేదు. కాబట్టి ఇప్పటికే తీసుకున్న క్రెడిట్‌ ఐటీసీ నియమ నిబంధనల మేరకు ఉంటే ఎలాంటి సమస్య లేదు.

ఇకపోతే, కొన్ని వస్తువులు పూర్తిగా పన్ను మినహాయింపులోకి చేరాయి. అంటే, వీటికి సంబంధించిన ఇన్‌పుట్‌ మీద ఇప్పటికే ఐటీసీ పొంది ఉంటారు. కానీ, 22 వ తేదీ నుంచి వీటి అమ్మకాలపై ఎలాంటి పన్ను వర్తించదు. కాబట్టి ఇలాంటి ఉత్పత్తులకు సంబంధించి 21 తేదీ నాటికి మిగిలి ఉన్న స్టాక్‌ మీద ఐటీసీ రివర్చ్‌ చేయాలి. చాలా సందర్భాల్లో ఉన్న స్టాక్‌కు సరిపడా ఐటీసీ బ్యాలెన్స్‌ ఉండదు. ఎందుకంటే ఐటీసీని ఎప్పటికప్పుడు ట్యాక్స్‌ చెల్లింపు కోసం వాడుతుంటారు. అలాంటప్పుడు క్యాష్‌ లెడ్జర్‌ ద్వారా తగ్గిన మేరకు చెల్లించాలి. కొన్ని సందర్భాల్లో ఉన్న స్టాక్‌ కంటే ఎక్కువ ఐటీసీ బ్యాలెన్స్‌ ఉంటుంది. అలాంటప్పుడు స్టాక్‌కు సరిపోను ఐటీసీ రివర్స్‌ చేయటంతో పాటుగా మిగిలినది కూడా రివర్స్‌ చేయాలి.


అదే ఉత్పత్తిదారులకైతే స్టాక్‌లో ఉన్న ఇన్‌పుట్స్‌తో పాటుగా సెప్టెంబరు 21 నాటికి తయారీలో ఉన్న ఇన్‌పుట్స్‌ అంటే సెమీ ఫినిష్డ్‌, ఫినిష్డ్‌ స్టేజీలో ఉన్న ఇన్‌పుట్స్‌ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని సరిపడా ఐటీసీ రివర్స్‌ చేయాలి. అలాగే క్యాపిటల్‌ గూడ్స్‌ మీద క్రెడిట్‌ తీసుకుని ఉంటే దాని జీవితకాలం 20 త్రైమాసికాలు (5 సంవత్సరాలు)గా భావించి, మిగిలిన కాలానికి సరిపోను ఐటీసీ రివర్స్‌ చేయాలి. ఇకపోతే, రేటు తగ్గింపునకు సంబంధించి సవరించిన ధరల జాబితా (ప్రైస్‌ లిస్ట్‌)ను ఉత్పత్తిదారులు.. డీలర్లు, రిటైలర్స్‌కు తప్పక పంపాలి. ఇది కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేట్లు తగు జాగ్రత్తలే తీసుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్య సందేహం ఏమిటంటే.. ఒకవేళ ఇప్పటికే అమ్ముడుపోయిన సరుకుకు సంబంధించి క్రెడిట్‌ నోట్‌ను సెప్టెంబరు 22 తర్వాత జారీ చేయాల్సి వస్తే.. ఏ రేటు పరిగణనలోకి తీసుకోవాలి? క్రెడిట్‌ నోట్‌ అనేది ఇంతకు ముందు జారీ చేసిన ఇన్వాయి్‌సకు సంబంధించి ఇస్తున్నారు కాబట్టి, ఇన్వాయి్‌సలో ఉన్న రేటును పరిగణనలోకి తీసుకోవాలి. అంటే పాత రేటు ప్రకారమే ఇవ్వాలి.

ఏది ఏమైనా తగ్గించిన పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి వ్యాపారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరాన్ని బట్టి తమ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో తగు మార్పులు చేసుకోవటంతో పాటు సెప్టెంబరు నెలకు సంబంధించిన రిటర్నులను జాగ్రత్తగా పరిశీలించి దాఖలు చేయాలి. ఒకటే ప్రొడక్ట్‌ అమ్మే వారికి పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ, వివిధ రకాల ఉత్పత్తులు అమ్ముతూ వాటిలో కొన్ని మినహాయింపులోకి వచ్చినప్పుడు ఐటీసీ రివర్స్‌ చేయటం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

రాంబాబు గొండాల

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 05:20 AM