Export Incentives: ఎగుమతులకు రూ 25000 కోట్ల ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:23 AM
ట్రంప్ సుంకాలతో ఆందోళనలో ఉన్న ఎగుమతిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే ఆరేళ్లలో ఎగుమతిదారులకు ప్రోత్సాహకాల రూపంలో రూ.25,000 కోట్లు అందించేందుకు...
న్యూఢిల్లీ: ట్రంప్ సుంకాలతో ఆందోళనలో ఉన్న ఎగుమతిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే ఆరేళ్లలో ఎగుమతిదారులకు ప్రోత్సాహకాల రూపంలో రూ.25,000 కోట్లు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) కింద ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందించనుంది. ఎగుమతిదారులకు తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు చెప్పాయి. కేంద్ర వాణిజ్య మంతిత్వ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్‌పెండీచర్ ఫైనాన్స్ కమిటీ (ఈఎ్‌ఫసీ)కి పంపించినట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News