Gold vs Silver: బంగారం, వెండి.. రెండింటిలో ఏది కొంటే మంచిది..
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:18 AM
బంగారం, వెండి ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం ఈ అరుదైన లోహాలకు కలిసి వస్తోంది.
బంగారం, వెండి ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడం ఈ అరుదైన లోహాలకు కలిసి వస్తోంది. సెంట్రల్ బ్యాంకు కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంతో 2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి (Gold Silver Rate).
ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 66% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే వెండి ధర దాదాపు 87% పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు లోహాలు మరింతగా పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సురక్షిత పెట్టుబడులు, వడ్డీ రేట్లు తగ్గడం, రూపాయి విలువ తగ్గడం, సెంట్రల్ బ్యాంక్ దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బంగారంలో పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు (gold vs silver 2025).
బంగారం ఇప్పటికే భారీగా పెరిగినందున ఆచితూచి కొనడం మంచిది. ఈ ఏడాదిలాగే మున్ముందు కూడా పెరుగుతుందని ఆశించకూడదు. అయితే ఆర్థిక భద్రత కోరుకునేవారు బంగారాన్ని ఒక స్థిరమైన పెట్టుబడిగా భావించొచ్చు. దీర్ఘకాలంలో లాభాలు ఆశించేవాళ్లకు కూడా బంగారం మంచి పెట్టుబడి ఆప్షన్ కింద పనికొస్తుంది. సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేస్తుండడం బంగారానికి గిరాకీ పెంచుతోంది. అయితే ఇప్పటికే బంగారం ధర ఊహించిన దాని కంటే పెరిగిపోయింది కాబట్టి జాగ్రత్త పడడం అవసరం (best metal to invest).
మరోవైపు వెండి కూడా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది (Silver Rate Today). వెండిని ఇటు ఆభరణాల్లోనూ, మరోవైపు పారిశ్రామిక వినియోగంలోను కూడా వాడతారు. దీంతో వెండి ధరలు తారస్థాయికి చేరుకున్నాయి. వెండి సరఫరా లోటు వరుసగా ఏడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం.. వెండి ధర 2026 చివరి నాటికి కిలోకు రూ. 2,40,000కు చేరుకుంటుంది (buy gold or silver now).
అయితే బంగారంతో పోల్చుకుంటే వెండి ధరల్లో ఒడిదుడుకులు కాస్త ఎక్కువ. పారిశ్రామికంగా డిమాండ్ ఎక్కువగా ఉంటే స్వల్ప కాలంలో బంగారం కంటే వెండి ఎక్కువ లాభాలు ఇవ్వగలదు. పారిశ్రామిక డిమాండ్ తగ్గితే అంతే వేగంగా పడిపోతుంది (safe haven assets). అయితే వెండి కూడా రాబోయే కాలంలో మంచి పెట్టుబడి ఆప్షన్‌గా ఉంటుంది.
వెండితో పోల్చుకుంటే బంగారం కాస్త ఎక్కువ భద్రత అందిస్తుంది. ధర భారీగా పెరగకపోయినా, విలువ పడిపోవడం అన్నది తక్కువ మోతాదులోనే ఉంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా, ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ తగ్గినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంగారం ఒక సేఫ్ ఆప్షన్‌గా పనికొస్తుంది.
ఇవి కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..