Gold Silver Rates Dhanteras: ధన త్రయోదశి రోజున సర్‌ప్రైజ్.. తగ్గిన బంగారం వెండి ధరలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:44 PM
ధన్ త్రయోదశి రోజున వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్. పసిడి, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ధన త్రయోదశి రోజున వినియోగదారులకు సర్‌ప్రైజ్. బంగారం, వెండి ధరల్లో నేడు భారీ తగ్గుదల నమోదైంది. బంగారం ధరల్లో యథాప్రకారం తగ్గుదల కనిపించగా వెండి ధరలు మాత్రం భారీగా పతనమయ్యాయి (Gold Rates, Silver Rates Crash on Dhanteras).
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, ఈసారి ట్రెండ్‌కు భిన్నంగా ధన త్రయోదశి రోజున వెండి ధరల్లో భారీగా కొత నమోదైంది. ముంబైలో ఇటీవల దాదాపు రూ.2 లక్షలకు చేరువైన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1.72 లక్షలకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.13 వేల మేర ధరల్లో కోత పడింది. గత 72 గంటల్లో ఏకంగా రూ.19 వేల మేర ధర తగ్గింది. ఢిల్లీలో కూడా వెండి ధర రూ.1.72 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర కూడా రూ.1,90,000 వద్ద తచ్చాడుతోంది.
ఢిల్లీ, ముంబై, చెన్నై మహానగరాల్లో బంగారం ధరల్లో నేడు తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,086కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే రూ.1910 మేర ధర తగ్గింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ ధర కూడా రూ.1750 మేర తగ్గి రూ.1,19,950గా ఉంది. హైదరాబాద్‌లో కూడా దాదాపు ఇదే స్థాయిలో పసడి ధరల్లో తగ్గుదల కనిపించింది.
వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,30,370; ₹1,19,500; ₹98,600
ముంబై: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
ఢిల్లీ: ₹1,31,010; ₹1,20,100; ₹98,290
కోల్‌కతా: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
బెంగళూరు: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
హైదరాబాద్: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
కేరళ: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
పూణె: ₹1,30,860; ₹1,19,950; ₹98,140
వడోదరా: ₹1,30,910; ₹1,20,000; ₹98,190
అహ్మదాబాద్: ₹1,30,910; ₹1,20,000; ₹98,190
కిలో వెండి ధరలు
చెన్నై: ₹1,90,000
ముంబై: ₹1,72,000
ఢిల్లీ: ₹1,72,000
కొలకతా: ₹1,72,000
బెంగళూరు: ₹1,80,000
హైదరాబాద్: ₹1,90,000
కేరళ: ₹1,90,000
పుణే: ₹1,72,000
వడోదరా: ₹1,72,000
అహ్మదాబాద్: ₹1,72,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
Mukesh Ambani: రిలయన్స్ లాభం రూ.18,165 కోట్లు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి