Gold Prices on Dec 15: బంగారం కొనాలనుకుంటే షాకే.. రూ.2 లక్షల మార్కు దాటిన వెండి
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:44 PM
దేశంలో బంగారం ధరలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.820 మేర పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,34,730కి చేరుకుంది. వెండి కూడా రూ.3 వేల మేర పెరిగి 2 లక్షల మార్కును దాటింది.
ఇంటర్నెట్ డెస్క్: గత వారం కాస్త శాంతించినట్టు కనిపించిన పసిడి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే పైపైకి ఎగబాకాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 12.00 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.820 మేర పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,34,730కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.720 మేర పెరిగి 1,23,500కు చేరుకుంది. వెండి ధరలకూ రెక్కలొచ్చాయి. సుమారు 3 వేల మేర పెరిగి రూ.2,00,900కు చేరుకుంది (Gold, Silver Prices on Dec 15).
చెన్నైలో 10 గ్రాములు 24 క్యారెట్ మేలిమి బంగారం ధర గరిష్ఠంగా 1,35,930కు చేరింది. ఢిల్లీలో 1,34,880గా ఉంది, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 1,34,730గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో 1,24,600కు చేరింది. హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,23,500గా ఉంది.
వెండి ధరలూ నేడు భారీగా ఎగబాకాయి. పలు నగరాల్లో రెండు లక్షల మార్కును దాటేశాయి. చెన్నైలో గరిష్ఠంగా కేజీ వెండి ధర రూ.2,13,000లను తాకింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. భారత్-అమెరికా డీల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత, డాలర్‌తో పోలిస్తే తగ్గుతున్న రూపాయి మారకం విలువ, ఫెడ్ వడ్డీ రేటులో కోత వెరసి పసిడి, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
జనవరి నుంచి పెరగనున్న టీవీల ధరలు!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి