Share News

Stock Market: మదుపరులు జర జాగ్రత్త..!

ABN , Publish Date - Dec 15 , 2025 | 02:57 AM

ఇన్వెస్టర్లు ఈ వారం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జియో పొలిటికల్‌ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో పాటు అమెరికా టెక్‌ కంపెనీల షేర్లు కుప్పకూలటంతో......

Stock Market: మదుపరులు జర జాగ్రత్త..!

ఇన్వెస్టర్లు ఈ వారం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. జియో పొలిటికల్‌ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో పాటు అమెరికా టెక్‌ కంపెనీల షేర్లు కుప్పకూలటంతో మదుపరులు జాగ్రత్తగా వ్యవహరించటం మంచి ది. ఆటమిక్‌ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఆ రంగంలోని కంపెనీల షేర్లను పరిశీలించవచ్చు.

స్టాక్‌ రికమండేషన్స్‌

స్విగ్గీ: జీవితకాల కనిష్ఠం నుంచి రూ.465 స్థాయికి చేరిన ఈ షేరు సెప్టెంబరు నుంచి దిద్దుబాటుకు లోనవుతోంది. చివరి నాలుగు సెషన్లలో కాస్త బలం ప్రదర్శించింది. స్వల్పకాలిక నిరోధాన్ని బ్రేక్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గత శుక్రవారం రూ.416 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.410 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.475 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.395 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టాటా స్టీల్‌: పదిహేను నెలల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసిన తర్వాత ఈ షేరు మళ్లీ దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం మెటల్స్‌కు డిమాండ్‌ పెరగటంతో పుంజుకుంటోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, బైయింగ్‌ వాల్యూమ్‌ పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.171.89 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.170 పై శ్రేణిలో ప్రవేశించి రూ.185 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.167 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎన్‌ఎండీసీ: నాలుగు నెలలుగా ఈ షేరు రూ.75 జోన్‌లో సైడ్‌వే్‌సలో చలిస్తోంది. మూమెంటమ్‌ పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.77.94 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.75 ఎగువన ప్రవేశించి రూ.81 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.73 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

పీఎన్‌బీ హౌసింగ్‌: డివిడెండ్‌ ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా పతనమైన ఈ కౌంటర్‌ ఆగస్టు నుంచి ఏకంగా 25 శాతం పెరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా పుంజుకుంటోంది. గత శుక్రవారం రూ.937 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.925 శ్రేణిలో ప్రవేశించి రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.910 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

నేషనల్‌ అల్యూమినియం (నాల్కో): ఈ ఏడాది మార్చి నుంచి వంద శాతానికి పైగా రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతోంది. నిఫ్టీతో పోల్చితే భారీగా జోరు ప్రదర్శిస్తోంది. డిమాండ్‌ ఉన్న రంగం కావటంతో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం రూ.278 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.270 శ్రేణిలో ప్రవేశించి రూ.320 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.255 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

Updated Date - Dec 15 , 2025 | 02:57 AM