Gold Rates on Dec 20: వినియోగదారులకు ఊరట! బంగారం, వెండి ధరల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:47 AM
బంగారం, వెండి ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. గత రెండు మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. మరి దేశంలో రేట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. మార్కెట్ వర్గాల అంచనాల కంటే తక్కువగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఉండటంతో ఫెడ్ రేట్ కోత అంచనాలు పెరిగాయి. అయితే, డాలర్ కూడా కాస్త బలపడటంతో బంగారం, ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,34,170గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే సుమారు రూ.680 మేర తగ్గింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.620 మేర తగ్గి రూ.1,22,990కు చేరింది. వెండి ధర కూడా దాదాపు రూ.3000 మేర తగ్గి రూ.2,08,900కు చేరుకుంది (Gold, Silver Rates December 20).
త్వరలో హాలిడే సీజన్ మొదలుకానుండటం, డాలర్ బలపడటం, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్ల దూకుడుకు బ్రేకులు పడి బంగారం, వెండి ధరలు కాస్త నెమ్మదించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే ఉండటంతో వచ్చే ఏడాదిలో మరోసారి ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కోతపై ఆశలు పెరిగాయని చెబుతున్నారు. కాబట్టి, ప్రస్తుతం ధరల్లో తగ్గుదల స్వల్పకాలిక దిద్దుబాటు మాత్రమేనని అన్నారు.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ(24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,35,050; ₹1,23,790; ₹1,03,290
ముంబై: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
న్యూఢిల్లీ: ₹1,34,320; ₹1,23,140; ₹1,00,780
కోల్‌కతా: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
బెంగళూరు: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
హైదరాబాద్: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
విజయవాడ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
కేరళ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
పుణె: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
వడోదరా: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
అహ్మదాబాద్: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
వెండి ధరలు ఇలా
చెన్నై: ₹2,20,900
ముంబై: ₹2,08,900
న్యూఢిల్లీ: ₹2,08,900
కోల్‌కతా: ₹2,08,900
బెంగళూరు: ₹2,08,900
హైదరాబాద్: ₹2,20,900
విజయవాడ: ₹2,20,900
కేరళ: ₹2,20,900
పుణె: ₹2,08,900
వడోదరా: ₹2,08,900
అహ్మదాబాద్: ₹2,08,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
తాజ్ జీవీకేకు టాటా గ్రూప్ గుడ్‌బై
సెన్సెక్స్.. రూ. 5.42 లక్షల కోట్ల సంపద వృద్ధి