Tata Group Exit: తాజ్ జీవీకేకు టాటా గ్రూప్ గుడ్‌బై
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:27 AM
టాటా గ్రూప్ హోటల్స్ కంపెనీ ‘ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్).. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే-భూపాల్ కుటుంబాల నిర్వహణలోని...
జీవీకే-భూపాల్ కుటుంబానికే వాటా అమ్మకం
నిర్వహణ మాత్రం టాటా సంస్థ ఐహెచ్‌సీఎల్‌దే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): టాటా గ్రూప్ హోటల్స్ కంపెనీ ‘ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్).. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జీవీకే-భూపాల్ కుటుంబాల నిర్వహణలోని తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ నుంచి తప్పుకుంది. ఈ కంపెనీ ఈక్విటీలో తనకున్న 25.52 శాతం (160 లక్షల షేర్లు) వాటా మొత్తాన్నీ జీవీకే-భూపాల్ కుటుంబానికే విక్రయించింది. ఒక్కోటి రూ.2 ముఖ విలువ కలిగి ఉన్న ఈ షేర్లను జీవీకే-భూపాల్ కుటుంబానికి చెందిన శాలినీ భూపాల్ రూ.370 చొప్పున రూ.592 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఐహెచ్‌సీఎల్-షాలినీ భూపాల్ మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరింది. దీంతో తాజ్ జీవీకే హోటల్స్ ఈక్విటీలో జీవీకే-భూపాల్ కుటుంబాల వాటా 74.99 శాతానికి చేరింది.
నిర్వహణ ఒప్పందం: తాజ్ జీవీకే హోటల్స్ ఈక్విటీ నుంచి తప్పుకున్నా ఆ సంస్థకు చెందిన ఆరు హోటల్స్ నిర్వహణను తన ‘తాజ్’ పేరుతో ఐహెచ్‌సీఎల్ కొనసాగిస్తుంది. వచ్చే మూలధన భారాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే తాజ్ జీవీకే హోటల్స్ ఈక్విటీ నుంచి తప్పుకున్నట్లు ఐహెచ్‌సీఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చత్వాల్ తెలిపారు.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్