Share News

Gold and Silver Rates Updates: మార్కెట్లో ప్రస్తుతం ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలివే..

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:02 PM

మంగళవారం ఉదయం నాటికి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మధ్యాహ్నానికి మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. అటు వెండి రేట్లు కూడా భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates Updates: మార్కెట్లో ప్రస్తుతం ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలివే..
Gold and Silver Rates

ఇంటర్నెట్ డెస్క్: నేటి మార్కెట్లో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం ఉదయంతో పోలిస్తే మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయానికి భారీగా ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,040లకు (Gold Rate in Hyderabad)గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.రూ.1,16,450గా నమోదైంది.


అయితే.. మార్కెట్లో ఇటీవల ధరలు కాస్త తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది(live gold rates). ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,27,190కి చేరగా.. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,16,660గా ఉంది.

అటు వెండి రేట్లు కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు(Silver Rate updates) రూ.1,74,000లకు చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.1,67,000గా ఉంది.


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆ సమయంలో మరోసారి ధరలు పరిశీలించగలరు.


ఇవీ చదవండి:

డిసెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ప్లాన్ చేస్కోండి.!

మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

Updated Date - Nov 25 , 2025 | 02:03 PM