Gold Prices Surge: బం గరం గరం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:12 AM
పసిడి, వెండి పరుగు ఆపనంటున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.1,950 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠస్థాయి రూ.1,27,950కి చేరింది...
పసిడి సరికొత్త ఆల్‌టైం రికార్డు
రూ.1.28 లక్షలకు 10 గ్రాముల ధర
ఒక్కరోజే రూ.1,950 పెరుగుదల
ప్రొద్దుటూరులో రూ.130,200కి చేరిన పసిడి
న్యూఢిల్లీ: పసిడి, వెండి పరుగు ఆపనంటున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.1,950 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠస్థాయి రూ.1,27,950కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహమూ అదే స్థాయిలో ఎగబాకి కొత్త ఆల్ టైం రికార్డు స్థాయి రూ.1,27,350 కి పెరిగింది. కిలో వెండి సైతం ఏకంగా రూ.7,500 పెరుగుదలతో రూ.1.79 లక్షల ధర పలికింది. సిల్వర్‌కూ ఇది కొత్త రికార్డే. అంతర్జాతీయంగా వీటి ధరలు మరింత ఎగబాకడమే ఇందుకు ప్రధాన కారణం. కాగా ప్రొద్దుటూరులో 10 గ్రాముల బంగారం ఏకంగా రూ.1.30,200 పలికింది. మరోవైపు ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం దాదాపు 2 శాతం ఎగబాకి సరికొత్త రికార్డు స్థాయి 4,084 డాలర్లకు చేరింది. సిల్వర్ సైతం దాదాపు 3 శాతం పెరుగుదలతో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 51.74 డాలర్లకు చేరుకుంది.
ధనత్రయోదశి నాటికి రూ.1.30 లక్షలకు: ఈ ఏడాదిలో బంగారం ధరలు ఇప్పటికే 50ు పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు కొనసాగితే, ఈ ధనత్రయోదశి (శనివారం) నాటికి 10 గ్రాముల బంగారం రూ.1.30 లక్షలు దాటవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ వందన భారతి అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో ధర రూ.1.50 లక్షలకు చేరుకోవచ్చని ఆమె అంచనా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News