Gold prices rise: మరింత పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:36 PM
బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పసిడి పరుగులు ఆగడం లేదు. ప్రతిరోజు సరికొత్త గరిష్టాలకు చేరుకుంటూ రికార్డులు నమోదు చేస్తోంది. తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రికార్డు గరిష్టానికి చేరింది.
బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పసిడి పరుగులు ఆగడం లేదు. ప్రతిరోజు సరికొత్త గరిష్టాలకు చేరుకుంటూ రికార్డులు నమోదు చేస్తోంది. తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1, 23, 850కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1, 15, 500ను తాకింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1, 54, 350కు చేరింది.
పండగల సీజన్ కావడం, అంతర్జాతీయంగా మార్కెట్ల అస్థిరత, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి పతనం బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices).
బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పరుగులు తీస్తోంది. వెండి కిలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని ఇటీవల మార్కెట్ పండితులు అంచనా వేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి