Share News

Gold Prices Set to Soar in 2026: కొత్త ఏడాది పసిడి బుల్‌ రన్‌ ఆగదు

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:53 AM

పసిడి ధర చుక్కలంటుతోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం ధర రూ.1.30 లక్షలు దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత మార్కెట్లో పసిడి ధర 60 శాతం...

Gold Prices Set to Soar in 2026: కొత్త ఏడాది పసిడి బుల్‌ రన్‌ ఆగదు

ధర 30 శాతం వరకు పెరిగే అవకాశం 8 ప్రపంచ స్వర్ణ మండలి వెల్లడి

న్యూఢిల్లీ: పసిడి ధర చుక్కలంటుతోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే 10 గ్రాముల మేలిమి (24 క్యారట్స్‌) బంగారం ధర రూ.1.30 లక్షలు దాటిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారత మార్కెట్లో పసిడి ధర 60 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో దేశంలో మరే పెట్టుబడులు ఈ స్థాయిలో లాభా లు పంచలేదు. మరోవైపు వచ్చే ఏడాది (2026) కూడా పసిడి పరుగు ఆగదని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో తెలిపింది. ప్రస్తు తం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) పసిడి 4,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వచ్చే ఏడాది ఇది మరో 15 నుంచి 30 శాతం (630-1,260 డాలర్లు) పెరిగి 4,840 నుంచి 5,470 డాలర్లకు చేరే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది. మరోవైపు ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌ కూడా దాదాపు ఇదే అంచనాలు వెలువరించింది. దీంతో వచ్చే ఏడాది భారత మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర.. 6 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎ్‌సటీ కలుపుకుంటే రూ.1,49,500 నుంచి రూ.1.69 లక్షలు పలికే అవకాశం ఉంటుందని అంచనా. అయితే ట్రంప్‌ సుంకాల పోటు ఫలించి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడితే మాత్రం ఔన్స్‌ పసిడి ధర 5 నుంచి 20 శాతం వరకు దిద్దుబాటుకు (కరెక్షన్‌) లోనయ్యే ప్రమాదం కూడా ఉందని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది.

బంగారం జోరుకు కారణాలు

  • తగ్గుతున్న వడ్డీ రేట్లు

  • కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు

  • కేంద్ర బ్యాంకులు, గోల్డ్‌ ఈటీఎ్‌ఫల కొనుగోళ్లు

  • సురక్షిత పెట్టుబడిగా పసిడికి ఉన్న పేరు

  • పొంచి ఉన్న ద్రవ్యోల్బణ భయాలు

ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 05:53 AM