Gold Rates on Nov 30: రూ.1.3 లక్షలకు చేరువలో పసిడి ధరలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:33 AM
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు మళ్లీ రూ.1.3 లక్షల మార్కుకు చేరువవుతున్నాయి. వెండి ధరల్లో కూడా ఇదే జోష్ కనిపిస్తోంది. మరి నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రూ.1.3 లక్షల మార్కును దాటేశాయి. ఈ వారంలో సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకే ఛాన్స్ ఉందన్న అంచనాలు బలపడుతున్నాయి. అక్టోబర్‌లో బంగారం ధర రూ.1,32,294 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన విషయం తెలిసిందే. ఇక గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (నవంబర్ 30) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,350 మేర పెరిగి రూ.1,29,820కు చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.1,240 మేర ఎగబాకింది. ఇక కిలో వెండి ధర ఏకంగా రూ.8900 మేర పెరిగి రూ.1,85,000కు చేరుకుంది (Gold, Silver Rates on Nov 30).
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్‌లల్లో కోత తప్పదన్న అంచనాలు అంకంతకూ బలపడుతుండటంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వ విధానాలతో డాలర్ బలహీనపడటం, పెళ్లి సీజన్ నేపథ్యంలో దేశీయంగా పెరిగిన డిమాండ్, అంతర్జాతీయ అనిశ్చితులు వెరసి పసిడికి డిమాండ్ పెరిగేలా చేస్తున్నాయి. ఇక వెండి ధరలూ అదే బాటలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్ (31.10 గ్రాములు) 4,250 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. త్వరలో ఇది మరింత పెరిగే అవకాశం మెండుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,30,690; ₹1,19,800; ₹99,950
ముంబై: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
న్యూఢిల్లీ: ₹1,29,970; ₹1,19,150; ₹97,520
కోల్‌కతా: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
బెంగళూరు: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
హైదరాబాద్: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
విజయవాడ: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
కేరళ: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
పుణె: ₹1,29,820; ₹1,19,000; ₹97,370
వడోదరా: ₹1,29,870; ₹1,19,050; ₹97,420
అహ్మదాబాద్: ₹1,29,870; ₹1,19,050; ₹97,420
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹1,92,000
ముంబై: ₹1,85,000
న్యూఢిల్లీ: ₹1,85,000
కోల్‌కతా: ₹1,85,000
బెంగళూరు: ₹1,85,000
హైదరాబాద్: ₹1,92,000
విజయవాడ: ₹1,92,000
కేరళ: ₹1,92,000
పుణె: ₹1,85,000
వడోదరా: ₹1,85,000
అహ్మదాబాద్: ₹1,85,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి