Gold Rates on Dec 5: పసిడి ధరల్లో తగ్గుదల.. స్థిరంగా వెండి
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:42 AM
భారత్‌లో గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం, వెండి వైపు పెట్టుబడులు మళ్లడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: సామాన్యులకు రిలీఫ్‌ను ఇస్తూ బంగారం ధరలు దిగొచ్చాయి. అమెరికాలో పెరిగిన నిరుద్యోగిత ఫెడ్ రేటులో కోతపై ఆశలు పెంచినా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం, లాభాల స్వీకరణకు దిగడంతో అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు తగ్గాయి. ఫలితంగా భారత్‌లోనూ ధరల్లో కోత నమోదైంది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.930 మేర తగ్గి రూ.1,29,660కు చేరింది. 22 క్యారెట్ గోల్డ్ ధరలో కూడా దాదాపు ఇదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,18,850గా ఉంది. వెండి ధరలు మాత్రం యథాతథంగా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,90,900గా ఉంది (Gold, Silver Rates on Dec 5).
అమెరికాలో నిరుద్యోగిత పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాల్లో స్పష్టమైంది. దీంతో, ఇంట్రాడే ట్రేడింగ్‌లో గోల్డ్ ధరలు దూసుకెళ్లినా ఇన్వెస్టర్లు మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడింది. ఇక యూఎస్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన డేటా కూడా విడుదల కావాల్సిన ఉండటంతో గోల్డ్‌కు ఆశించిన మేర డిమాండ్ పెరగలేదు. మరోవైపు, పారిశ్రామికంగా అధిక డిమాండ్ ఉన్న వెండి వైపు స్పెక్యులేటివ్ పెట్టుబడులు మళ్లాయి. దీంతో, బంగారం ధరలు దిగొచ్చాయి. అయితే, అమెరికా ఆర్థికంగా బలహీనపడటంతో ఫెడ్ రేటు కోత తప్పదన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో, గోల్డ్ రేట్స్ మళ్లీ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని వివిధ నగరాల్లో గోల్డ్ రేట్స్(24కే, 22కే, 18కే) ఇవీ
చెన్నై: ₹1,31,120; ₹1,20,190; ₹1,00,240
ముంబై: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
న్యూఢిల్లీ: ₹1,29,800; ₹1,18,990; ₹97,380
కోల్‌కతా: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
బెంగళూరు: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
హైదరాబాద్: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
విజయవాడ: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
కేరళ: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
పుణె: ₹1,29,650; ₹1,18,840; ₹97,230
వడోదరా: ₹1,29,700; ₹1,18,890; ₹97,280
అహ్మదాబాద్: ₹1,29,700; ₹1,18,890; ₹97,280
వెండి (కిలో) ధరలు ఇలా
చెన్నై: ₹1,99,900
ముంబై: ₹1,90,900
న్యూఢిల్లీ: ₹1,90,900
కోల్‌కతా: ₹1,90,900
బెంగళూరు: ₹1,90,900
హైదరాబాద్: ₹1,99,900
విజయవాడ: ₹1,99,900
కేరళ: ₹1,99,900
పుణె: ₹1,90,900
వడోదరా: ₹1,90,900
అహ్మదాబాద్: ₹1,90,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలను మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి