Gold Hits Record: బంగారం @ రూ.1.07 లక్షలు
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:37 AM
పసిడి సరికొత్త జీవనకాల పతాక స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,07,070కి చేరింది. 99.5ు స్వచ్ఛత గల బంగారం రేటు కూడా అదే స్థాయిలో ఎగబాకి...
వరుసగా 8 రోజుల్లో రూ.6,900 అప్
పసిడి సరికొత్త జీవనకాల పతాక స్థాయికి ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,07,070కి చేరింది. 99.5ు స్వచ్ఛత గల బంగారం రేటు కూడా అదే స్థాయిలో ఎగబాకి రూ.1,06,200కి చేరుకుంది. కిలో వెండి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1,26,100 పలికింది. బంగారం ధరలు పెరగడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. గడిచిన 8 రోజుల్లో తులం బంగారం రూ.6,900 పెరిగింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో ప్రామాణిక వడ్డీరేట్లను మరో 0.25ు తగ్గించవచ్చన్న అంచనాలతోపాటు అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు బంగారం, వెండి ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర రేటు తొలిసారిగా 3,600 డాలర్ల మైలురాయిని దాటింది. ఒకదశలో 3,622 డాలర్ల వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. సిల్వర్ 41.35 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. అంతర్జాతీయంగా వీటి ధరలు మున్ముందు మరింత ఎగబాకవచ్చని బులియన్ నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి