Gold Price : బంగారం@ రూ.83,000
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:21 AM
పసిడి వరుసగా ఎనిమిదో రోజూ ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం..ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం

సరికొత్త రికార్డు స్థాయికి ధర.. వరుసగా 8వ రోజూ పైపైకి..
న్యూఢిల్లీ: పసిడి వరుసగా ఎనిమిదో రోజూ ఎగబాకి సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం..ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర శుక్రవారం రూ.200 పెరిగి రూ.83,100కు చేరింది. బంగారం రూ.83,000 దాటడం ఇదే తొలిసారి. 99.5 స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.200 పెరుగుదలతో రూ.82,700కు ఎగబాకింది. వెండి సైతం కిలో రూ.500 పెరుగుదలతో రూ.94,000 ధర పలికింది. కాగా, ముంబై స్పాట్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.80,348, 99.5 శాతం ప్యూర్ గోల్డ్ రేటు రూ.80,026కు చేరింది. కిలో వెండి రూ.91,211గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికొస్తే, 24 క్యారెట్ల గోల్డ్ రూ.82,420కి, 22 క్యారెట్ల రేటు రూ.75,550కి పెరగగా.. కిలో వెండి రూ.1.05 లక్షలకు ఎగబాకింది.
అంతర్జాతీయ అనిశ్చితులే కారణం..
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు, వాణిజ్య విధానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరిగింది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న పసిడికి మళ్లీ డిమాండ్ పెరిగిందని బులియన్ విశ్లేషకులు వెల్లడించారు. దాంతో దేశీయంగానూ ఈ విలువైన లోహం ధరలు కొండెక్కుతున్నాయని వారన్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి రేటు ఒకదశలో 15.50 డాలర్లు (0.56 శాతం) పెరిగి 2,780.50 డాలర్లకు చేరింది. వెండి సైతం 1.53 శాతం ఎగబాకి 31.32 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఈ ఏడాదిలో 3,000 డాలర్లకు ఔన్స్ గోల్డ్!
ప్రామాణిక వడ్డీ రేట్లపై అమెరికా సెంట్రల్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంతో పాటు వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నిర్ణయాలు పసిడి ధరల భవిష్యత్ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ విభాగ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వాణిజ్యపరమైన అనిశ్చితులు కొనసాగితే ఈ ఏడాదిలోనే ఔన్స్ గోల్డ్ 3,000 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని బులియన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇవి కూడా చదవండి..
Manish Sisodia: సీఎం చేస్తామంటూ బీజేపీ ఆఫర్: సిసోడియా
Explosion.. మహారాష్ట్రలో భారీ పేలుడు: ఐదుగురి మృతి..
Governor: అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్షే..
Read More National News and Latest Telugu News