Share News

Gold Price Record India: బంగారం సరికొత్త రికార్డు

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:48 AM

పసిడి పరుగు ఆపనంటోంది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో...

Gold Price Record India: బంగారం సరికొత్త రికార్డు

ఫ్యూచర్స్‌ మార్కెట్లో రూ.1.09 లక్షలకు..

న్యూఢిల్లీ: పసిడి పరుగు ఆపనంటోంది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో అక్టోబరు డెలివరీ కాంట్రాక్టు ధర రూ.452 పెరిగి రూ.1,08,180కి చేరగా.. డిసెంబరు డెలివరీ కాంట్రాక్టు రేటు సైతం రూ.370 ఎగబాకి రూ.1.09 లక్షలు దాటింది. కిలో వెండి డిసెంబరు కాంట్రాక్టు ధర కూడా రూ.1,703 పెరుగుదలతో రూ.1,26,400 పలికింది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 01:48 AM