బంగారం రూ.లక్ష పైకి
ABN , Publish Date - May 08 , 2025 | 04:31 AM
పసిడి మళ్లీ లక్ష రూపాయలు దాటింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,00,750కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం...
పసిడి మళ్లీ లక్ష రూపాయలు దాటింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,00,750కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం రూ.1,050 పెరుగుదలతో రూ.1,00,350కి ఎగబాకింది. కిలో వెండి కూడా రూ.440 పెరిగి రూ.98,940 ధర పలికింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతో అంతర్జాతీయంగా వీటి ధరలు మళ్లీ ఎగబాకడం, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,369 డాలర్లు, వెండి 32.81 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు