Gold Rates on 17 Oct 2025: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే జోరు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 17 , 2025 | 06:52 AM
అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా పండుగ సీజన్ కారణంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరల్లో ర్యాలీ కొనసాగుతూనే ఉంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలు, బలహీన పడుతున్న డాలరు విలువ కలగలిసి బంగారానికి డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగానూ పసిడి జీవితకాల గరిష్టాలను నమోదు చేస్తోంది. ఇక భారత్‌లో పండుగ సీజన్ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలు నేడూ అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇక శుక్రవారం నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 11.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,31,410 మార్కును చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,690కు పెరిగింది. కిలో వెండి ధర రూ.1,86,000కు చేరింది.
గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధరలు రికార్డు స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర 2400 రూపాయల మేర పెరిగి రూ.1,32,294కు చేరుకుంది. ఎమ్‌సీఎక్స్ వెండి ఫ్యూచర్స్ ధర రూ.1,70,415 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఔన్స్ ధర 4300 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఈ ఏడాది చివరకు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 4,400 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచానా వేస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
Infosys: ఇన్ఫీ లాభం రూ.7,364 కోట్లు
Hyundai Motor India: వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి