Gold Rates on Oct 16: తగ్గేదేలేదంటున్న పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఇవీ
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:44 AM
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్, భారత్‌లో పండుగ సీజన్ కారణంగా బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. మరి నేటి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి పెరిగిన డిమాండ్, భారత్‌లో పండుగ సీజన్ వెరసి బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలు, చైనాతో కొనసాగుతున్న ఆర్థిక ప్రతిష్టంభన కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ పసిడి ధర 4,200 డాలర్ల వద్ద తచ్చాడుతోంది (Gold, Silver Rates on Oct, 16, 2025).
భారత్‌లోనూ ధన్‌తేరస్, దీపావళి పండుగల కారణంగా గత కొద్ది రోజులుగా ధరల్లో ర్యాలీ కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడూ పసిడి, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,450గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,660కు ఎగబాకగా, 18 క్యారెట్ పసిడి కూడా 97,090కు పెరిగింది. వెండి కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,90,100గా ఉంది. అయితే, 10 గ్రాముల ప్లాటినం ధర మాత్రం స్వల్పంగా తగ్గి రూ.46,810గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే,18కే) ఇవీ
చెన్నై: ₹1,29,390; ₹1,18,610; ₹97,010
ముంబై: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
ఢిల్లీ: ₹1,29,600; ₹1,18,810; ₹97,240
కోల్‌కతా: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
బెంగళూరు: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
హైదరాబాద్: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
కేరళ: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
పూణె: ₹1,29,450; ₹1,18,660; ₹97,090
వడోదరా: ₹1,29,500; ₹1,18,710; ₹97,140
అహ్మదాబాద్: ₹1,29,500; ₹1,18,710; ₹97,140
వెండి ధరలు ఇలా
చెన్నై: ₹2,07,100
ముంబై: ₹1,90,100
ఢిల్లీ: ₹1,90,100
కోల్‌కతా: ₹1,90,100
బెంగళూరు: ₹1,95,100
హైదరాబాద్: ₹2,07,100
కేరళ: ₹2,07,100
పూణె: ₹1,90,100
వడోదరా: ₹1,90,100
అహ్మదాబాద్: ₹1,90,100
గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
Hyundai Motor India: వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Record-Breaking IPO Market in Samvat 2081: సంవత్ 2081లో ఐపీఓల జోరు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి