Gold Rates on Oct 18: ధన త్రయోదశి ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి బంగారం ధర
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:55 AM
అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా పండుగ సీజన్ నెలకొనడంతో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా పండుగ సీజన్ నెలకొనడంతో బంగారం ధరలు గత వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం తొలిసారిగా రూ1.35 లక్షల ఆల్ టైమ్ రికార్డు స్థాయిని చేరి ఆ తరువాత కాస్త తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రేట్లు ఏకంగా 58 శాతం పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (శనివారం) ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,780గా ఉంది (Gold and Silver Rates on 18 Oct, 2025). 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,21,710 వద్ద తచ్చాడుతుండగా 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.9,959ల ధర పలుకుతోంది. ఇక వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండి రేటు ప్రస్తుతం రూ. 1,84,900గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్‌కు (31.10 గ్రాములు) 4,300 డాలర్ల వద్ద తచ్చాడుతున్నాయి.
ధరలు ఇంతలా పెరుగుతున్నా డిమాండ్‌కు ఢోకా లేదని దేశంలోని జువెలర్స్ సంస్థలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాల్లో నగదు లభ్యత పెరగడం, జీఎస్టీ సంస్కరణలు, పే కమిషన్ ఏరియర్స్ చెల్లింపులు, ద్రవ్యోల్బణం తగ్గుదల వంటివన్నీ ప్రజలను బంగారం కొనుగోళ్లకు ప్రోత్సహిస్తున్నాయి. ఓవరాల్ డిమాండ్ అధికంగానే ఉందని ప్రముఖ జెవెలర్స్ సంస్థలు చెబుతున్నాయి. బంగారం విక్రయాలు మరింత పెంచేందుకు పలు ప్రమోషనల్ ఆఫర్లు, రేట్ గ్యారెంటీలు వంటివి కూడా ప్రకటిస్తున్నాయి. చిన్న చిన్న బంగారు కాయిన్స్‌ను ఇళ్లకు కూడా డెలివరీ చేస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,33,100; ₹1,22,010; ₹1,01,010
ముంబై: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
ఢిల్లీ: ₹1,32,930; ₹1,21,860; ₹97,210
కోల్‌కతా: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
బెంగళూరు: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
హైదరాబాద్: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
కేరళ: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
పూణె: ₹1,32,780; ₹1,21,710; ₹99,590
వడోదరా: ₹1,32,830; ₹1,21,760; ₹99,640
అహ్మదాబాద్: ₹1,32,830; ₹1,21,760; ₹99,640
కిలో వెండి ధర ఇలా..
చెన్నై: ₹2,02,900
ముంబై: ₹1,84,900
ఢిల్లీ: ₹1,84,900
కోల్‌కతా: ₹1,88,800
బెంగళూరు: ₹1,93,800
హైదరాబాద్: ₹2,02,900
కేరళ: ₹2,02,900
పూణె: ₹1,84,900
వడోదరా: ₹1,84,900
అహ్మదాబాద్: ₹1,84,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవీ చదవండి:
Mukesh Ambani: రిలయన్స్ లాభం రూ.18,165 కోట్లు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి