Share News

Gold Rates on Oct 22: పసిడి ధరల్లో భారీ తగ్గుదల.. నిన్నటితో పోలిస్తే ఏకంగా..

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:47 PM

నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి రేట్లల్లోనూ కోత పడింది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1.25లక్షలకు చేరుకుంది.

Gold Rates on Oct 22: పసిడి ధరల్లో భారీ తగ్గుదల.. నిన్నటితో పోలిస్తే ఏకంగా..
Gold Price on Oct 22 Hyderabad

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరల్లో నేడు రికార్డు స్థాయిలో తగ్గుదల నమోదైంది. ఇటీవల వరకూ చుక్కలను అంటిన ధరలు నేడు హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో నేలకు దిగొచ్చాయి (Gold Rates on Oct 22 Hyderabad).

బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు సగటున రూ.1,25,500కు చేరుకున్నాయి. కిలో వెండి ధర రూ.1.6 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,250గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,14,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,58,000లకు దిగొచ్చింది. నిన్న ఇదే సమయానికి నగరంలో 24 క్యారెట్ పసిడి ధరలు సుమారు రూ.1,32,000గా ఉన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. గత 12 ఏళ్లల్లో తొలిసారిగా నేటి ఇంట్రాడేలో ఏకంగా 6.3 శాతం మేర ఔన్స్ బంగారం ధర పడిపోయింది. ప్రస్తుతం 4 వేల డాలర్ల వద్ద తచ్చాడుతోంది.


ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరల్లో భారీగా పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో ధరలు తాజాగా టెక్నికల్ కరెక్షన్స్‌కు లోనైనట్టు చెబుతున్నారు. దీనితో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, చక్కబడుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, బలపడుతున్న డాలర్, అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతాయన్న అంచనాలు బంగారం, వెండికి డిమాండ్ తగ్గించాయన్న అంచనాలు ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న బంగారం రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

ఈ పండుగ సీజన్‌లో పతాకస్థాయికి వాణిజ్యం.. చరిత్రలో మొదటిసారి..

బంగారంలానే వెండిని కూడా కల్తీ చేస్తారా?.. తెలుసుకోవటం ఎలా?..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 07:57 PM