Share News

Gold and Silver Caution Advised : పసిడి వెండిపై జరజాగ్రత్త

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:27 AM

బంగారం, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. ధరలపరంగా రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. గత ఏడాది ధనత్రయోదశి నుంచి ఈ ఏడాది ధనత్రయోదశి మధ్య 10 గ్రాములు మేలిమి...

Gold and Silver Caution Advised : పసిడి వెండిపై జరజాగ్రత్త

అతిగా కొంటే అనర్థమే

ర్యాలీకి బ్రేక్‌ పడే అవకాశం

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగెడుతున్నాయి. ధరలపరంగా రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. గత ఏడాది ధనత్రయోదశి నుంచి ఈ ఏడాది ధనత్రయోదశి మధ్య 10 గ్రాములు మేలిమి (24 క్యారట్లు) పసిడి ధర రూ.81,400 నుంచి రూ.1,34,800కు చేరి మదుపరులకు 62 నుంచి 65 శాతం లాభాలు పంచింది. వెండి ఽధరా నేనేమీ తక్కువ కాదంటూ 69 నుంచి 70 శాతం వరకు పెరిగింది. దీంతో చాలా మంది ముఖ్యంగా మహిళలు, అయ్యో చౌకగా ఉన్నపుడు వీటిని కొనలేక పోయామే అని బాధపడుతున్నారు. పెట్టుబడి లాభాల కోసం చూసే మదుపరులదీ ఇదే బాధ. గత ఏడాది ఇదే కాలంలో స్టాక్‌ మార్కెట్‌ అత్తెసరు లాభాలతో సరిపెట్టగా బంగారం, వెండి మాత్రం మదుపరులకు గతంలో ఎన్నడూ లేని విధంగా బంపర్‌ లాభాలు పంచాయి.

కరెక్షన్‌కు

అవకాశం!

ఈ ఏడాది ఇప్పటి వరకు చూసినా బంగారం, వెండి మదుపరులకు 50 శాతం పైనే లాభాలు పంచాయి. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరిన బులియన్‌ మార్కెట్‌ త్వరలోనే దిద్దుబాటుకు లోనయ్యే పరిస్థితి ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. ప్రాథమిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. లాభాల స్వీకరణ అమ్మకాలు ఇందుకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. ఈ దిద్దుబాటు కూడా 5 శాతం నుంచి 7 శాతం మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ బెదిరింపులు ఫలించి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి బ్రేక్‌ పడినా ఈ దిద్దుబాటు 10 నుంచి 15 శాతానికి మించకపోవచ్చని భావిస్తున్నారు.

బంగారం, వెండి ధరలు ఎంతగా పెరిగినా.. పెట్టుబడుల్లో అవి ఒక పరిమితి స్థాయికి మించి ఉండకూడదు. మదుపరులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం పసిడి ధరల పెరుగుదలకు ఎలాంటి ఫండమెంటల్స్‌ లేవు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నాటి నుంచే ఇది పెరగటం ప్రారంభమైంది. మొత్తం పెట్టుబడుల్లో బంగా రం, వెండి వాటా 10 శాతానికి మించకుండా చూసుకోవటం మంచిది.

నీలేష్‌ షా, ఎండీ, కోటక్‌ మహీంద్రా ఏఎంసీ


1000-Business.jpg

పెట్టుబడుల్లో 10 శాతం వరకు ఓకే

ఇటీవల పెట్టుబడి లాభాల కోసం బంగారం, వెండి కొనే దారి సంఖ్య భారీగా పెరిగింది. గతంలో మన దేశంలో బంగారం, వెండి కొనే వారిలో 60 నుంచి 65 శాతం మంది నగ నట్రా కోసం కొనేవారు. కేవలం 35 నుంచి 40 శాతం మంది మాత్రమే పెట్టుబడి లాభాల కోసం కొనేవారు. ఇప్పుడది తిరగబడింది. ఇటీవలి ర్యాలీతో అది మరింత పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. కొంత మందైతే స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులతో విసిగిపోయి ఉన్న నాలుగు రాళ్లతో బంగారం, వెండి కొనేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. ఆర్థిక పరిస్థితులు, అనిశ్చిత కుదుటపడి ఆర్‌బీఐతో సహా కేంద్ర బ్యాంకులన్నీ పసిడి, వెండి కొనుగోళ్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి, అమ్మకాలు మొదలు పెడితే ఈ రెండు లోహాల ధర భారీగా దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే లాభాల మాట దేవుడెరుగు, ఉన్న పెట్టుబడులే హరించుకుపోయే ప్రమా దం ఉందని ఇన్వె్‌స్టమెంట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇన్వెస్టర్‌ తన పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతానికి మించి బంగారం, వెండిలో మదుపు చేయక పోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అల్పపీడనం ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 20 , 2025 | 02:27 AM