Share News

Garudavega: గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:48 AM

గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్‌మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.

Garudavega: గరుడవేగ సంస్థ ఆధ్వర్యంలో ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ సైక్లింగ్ ఈవెంట్
Garudvega Cycling Event

గరుడవేగ (Garudavega.com) కంపెనీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాల కోసం సంస్థ సైక్లింగ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి, వారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేలా ‘పెడల్ టూ ప్రోగ్రెస్’ (Pedal to Progress) పేరిట 12 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీని నిర్వహించింది.

ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీ రామ్ దుర్వాసుల మాట్లాడుతూ Pedal to Progress కార్యక్రమం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ఉద్యోగుల ఆరోగ్యానికే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. వారి ఆరోగ్యకర జీవనశైలి, పర్యావరణ చైతన్యం తమ ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు. ఇంతకు ముందు కూడా ఓ వాకింగ్ ఈవెంట్‌ను నిర్వహించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని సూచించారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Garudavega.jpg


సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం, కీళ్ల నొప్పులు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగుపడటం, ఊపిరితిత్తుల పనితీరు పెరగడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ఇది సులభమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాయామమని చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి పునాది అన్నది తమ విశ్వాసమని చెప్పారు.

ఈ కార్యక్రమం పూర్తిగా ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగే ఆరోగ్యకరమైన అవుట్‌డోర్ యాక్టివిటీ అని అన్నారు. ఉద్యోగులు రోజువారీ పనులకు కాస్తంత విరామమిచ్చి, ఒకే వేదికపై చేరి, టీమ్ కోఆర్డినేషన్, కలసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకునేలా ఈ ఈవెంట్‌ను రూపొందించామని చెప్పారు.

నార్సింగి సైక్లింగ్ హబ్, TSPA యాక్సెస్ పాయింట్ నుండి దాదాపుగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు 100 మందికి పైగా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మొదటి మూడు టీమ్స్‌కు ప్రత్యేక బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈవెంట్‌లో పాల్గొన్న వారందరూ సంస్థ సీఈఓ, డైరెక్టర్ల చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందుకున్నారు.


ఇవీ చదవండి:

భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు

పీఎస్‌బీల్లో మరో మెగా విలీనం!

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 02 , 2025 | 12:06 PM