Foreign Portfolio Investors: ఎఫ్‌పీఐలు పీఛేముడ్
ABN , Publish Date - Dec 08 , 2025 | 02:33 AM
మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎ్‌ఫపీఐ) పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ.11,820 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి...
ఈ ఏడాదిలో రూ.1.55 లక్షల కోట్లకు చేరిన అమ్మకాలు
గతవారంలో రూ.11,820 కోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎ్‌ఫపీఐ) పెద్ద ఎత్తున తరలిపోతున్నాయి. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ.11,820 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. గతనెలలోనూ రూ.3,765 కోట్లు తరలిపోయాయి. దీంతో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ.1.55 లక్షల కోట్లకు చేరాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం ఎఫ్‌పీఐల అమ్మకాలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మన మార్కెట్‌లో అమ్మగా వచ్చిన నిధులను ఎఫ్‌పీఐలు చైనా, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్‌లకు మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
భారత సంతతి వ్యక్తికి యాపిల్ సంస్థలో కీలక బాధ్యతలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి