Share News

FMCG Pricing Confusion: ఎఫ్‌ఎంసీజీకి ఎంఆర్‌పీ తంటా

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:45 AM

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఈ నెల 22 నుంచి తగ్గించిన జీఎ్‌సటీ రేట్లను అమలు చేయటంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే గిడ్డంగులు, కిరాణా దుకాణాల్లో పాత ఎంఆర్‌పీతో ఉన్న వస్తువులపై కొత్త రేట్లను ఎలా అమలు చేయాలో..

FMCG Pricing Confusion: ఎఫ్‌ఎంసీజీకి ఎంఆర్‌పీ తంటా

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ఈ నెల 22 నుంచి తగ్గించిన జీఎ్‌సటీ రేట్లను అమలు చేయటంపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పటికే గిడ్డంగులు, కిరాణా దుకాణాల్లో పాత ఎంఆర్‌పీతో ఉన్న వస్తువులపై కొత్త రేట్లను ఎలా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. దీంతో పాత ఎంఆర్‌పీ రేట్లపై డిస్కౌంట్‌తో అమ్మేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కంపెనీలు కోరుతున్నాయి. కొన్ని రిటైల్‌ చెయిన్స్‌ అయితే ఇందు కు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ‘ఖాతాదారుడికి ఇచ్చే తుది బిల్లులో ప్రభుత్వం తగ్గించిన జీఎ్‌సటీ రేటును డిస్కౌంట్‌ రూపంలో తగ్గించి ఇస్తాం’ అని వీమార్ట్‌ సీఎండీ లలిత్‌ అగర్వాల్‌ తెలిపారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఈ సరుకులపై ఏమి చేయాలి? అనే ఆలోచిస్తున్నారు’ అని ఇమామీ కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ హర్షవర్ధన్‌ అగర్వాల్‌ తెలిపారు. మారిన జీఎ్‌సటీ రేట్లకు అనుగుణంగా కొత్త ఎంఆర్‌పీతో వస్తువులను మార్కెట్లో విడుదల చేసేందుకు కొద్దిగా సమయం పడుతుందని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చే నెల తొలి వారం లేదా మధ్య నాటికి గానీ ఇది సాధ్యం కాదని గోద్రెజ్‌ కన్స్యూమర్‌ ఎండీ, సీఈఓ సుధీర్‌ సేనాపతి చెప్పారు. దీంతో తగ్గిన జీఎ్‌సటీ రేట్లను వినియోగదారులకు బదిలీ చేయడంలో కొన్ని స్వల్పకాలిక అవాంతరాలు తప్పక పోవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 09 , 2025 | 01:45 AM