Share News

Paddy Cultivation: వరి సాగులో కార్బన్‌ క్రెడిట్స్‌ను అందుకున్న తొలి భారతీయ కంపెనీ

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:08 AM

హైదరాబాద్‌కు చెందిన క్లైమెట్‌ టెక్‌ స్టార్టప్‌ సౌ అండ్‌ రీప్‌ ఆగ్రో.. వరి సాగులో వినూత్నమైన పద్ధతులను అవలంబించినందుకు గాను గోల్డ్‌ స్టాండర్డ్‌ నుంచి కార్బన్‌ క్రెడిట్స్‌ను అందుకుంది. వరి సాగులో కార్బన్‌ క్రెడిట్స్‌ను...

Paddy Cultivation: వరి సాగులో కార్బన్‌ క్రెడిట్స్‌ను అందుకున్న తొలి భారతీయ కంపెనీ

  • హైదరాబాద్‌కు చెందిన క్లైమెట్‌ టెక్‌ స్టార్టప్‌ సౌ అండ్‌ రీప్‌ ఆగ్రో.. వరి సాగులో వినూత్నమైన పద్ధతులను అవలంబించినందుకు గాను గోల్డ్‌ స్టాండర్డ్‌ నుంచి కార్బన్‌ క్రెడిట్స్‌ను అందుకుంది. వరి సాగులో కార్బన్‌ క్రెడిట్స్‌ను అందుకున్న తొలి భారతీయ కంపెనీ ఇదే కావటం విశేషం. కోషెర్‌ క్లైమెట్‌ భాగస్వామ్యంలో ఆల్టర్నేటివ్‌ వెట్టింగ్‌ అండ్‌ డ్రైయింగ్‌ (ఏడబ్ల్యూడీ) విధానంలో చేపట్టిన ‘వారీ’ ప్రాజెక్ట్‌ 37,405 కార్బన్‌ క్రెడిట్స్‌ను కంపెనీ దక్కించుకుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తున్న 35,000 మంది రైతులు కంపెనీకి చెందిన వారీ ప్రాజెక్టులో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు.. వరి సాగులో నీరు, ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గిచటంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవటమే కాకుండా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగారని సౌ అండ్‌ రీప్‌ ఆగ్రో వెల్లడించింది.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 15 , 2025 | 01:21 PM