Equity Market: నాలుగు రోజుల నష్టాలకు తెర
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:47 AM
ఈక్విటీ మార్కెట్ నాలు గు రోజుల నష్టాలకు తెర దించింది. టెక్, ఐటీ షేర్ల కొనుగోలుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే ఆర్‌బీఐ పాలసీపై అప్రమత్తత, రూపాయి బలహీనత లాభాలను...
380 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: ఈక్విటీ మార్కెట్ నాలు గు రోజుల నష్టాలకు తెర దించింది. టెక్, ఐటీ షేర్ల కొనుగోలుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే ఆర్‌బీఐ పాలసీపై అప్రమత్తత, రూపాయి బలహీనత లాభాలను పరిమితం చేశాయి. మొత్తం మీద గురువారం ఇంట్రాడేలో 380 పాయింట్ల పైగా పెరిగిన సెన్సెక్స్ ఆ లాభాన్ని 158.51 పాయింట్లకు పరిమితం చేసుకుని 85,265.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 47.75 పాయింట్ల లాభంతో 26,033.75 వద్ద క్లోజైంది. అంతకు ముందు వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 613 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయాయి. శుక్రవారం ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దూరంగా ఉండడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ అన్నారు.
19 పైసలు లాభపడిన రూపాయి: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయి నుంచి స్వల్పంగా కోలుకుంది. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించవచ్చన్న అంచనాలు రూపాయికి ఊపిరి పోశాయి. గురువారం ఒక దశలో ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 90.43 వరకు దిగజారినప్పటికీ తదుపరి కాస్తంత నిలదొక్కుకుంది. చివరికి 19 పైసలు లాభంతో 89.96 వద్ద ముగిసింది.
నెఫ్రో ప్లస్ షేరు ధర రూ.438-460: నెఫ్రో ప్లస్ బ్రాండ్‌తో డయాలసిస్ సేవలందిస్తున్న నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చే వారంలో జారీ చేయనున్న ఐపీఓలో షేరు ధర శ్రేణిని రూ.438-460గా ప్రకటించింది. కంపెనీ విలువ రూ.4,600 కోట్లుగా పరిగణించి ధరను నిర్ణయించారు. రూ.871 కోట్ల సమీకరణ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తున్న నెఫ్రోప్లస్ ఇష్యూ వచ్చే బుధవారం (10వ తేదీ) ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది.
ఇవీ చదవండి:
రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..
జనరిక్ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్ రెడ్డీస్‌కు గ్రీన్ సిగ్నల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి