Emirates NBD: ఎమిరేట్స్ ఎన్‌బీడీకి ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో మెజారిటీ వాటా
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:08 AM
దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన లిస్టెడ్ బ్యాంకింగ్ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ఎమిరేట్స్ ఎన్‌బీడీ సన్నాహాలు చేస్తోంది. గత కొద్ది నెలలుగా...
ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న చర్చలు
డీల్ విలువ రూ.9,000 కోట్ల పైనే ఉండే చాన్స్
న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన లిస్టెడ్ బ్యాంకింగ్ సంస్థ ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ఎమిరేట్స్ ఎన్‌బీడీ సన్నాహాలు చేస్తోంది. గత కొద్ది నెలలుగా ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో 51 శాతానికి పైగా వాటాను చేజిక్కించుకునేందుకు ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఆసక్తిగా ఉందని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని, డీల్ కుదిరేందుకు మరి కొంత సమయం పట్టవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. సోమవారం బీఎ్‌సఈలో ఆర్‌బీఎల్ షేరు ధర రూ.290.15 వద్ద స్థిరపడింది. బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,786.79 కోట్లుగా నమోదైంది. ఈ లెక్కన బ్యాంక్‌లో 51 శాతం వాటా కోసం ఎమిరేట్స్ ఎన్‌బీడీ రూ.9,071 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా కొనుగోలుకు పోటీపడుతున్న సంస్థల్లో ఎమిరేట్స్ ఎన్‌బీడీ కూడా ఉందని గతంలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News