Elon Musk: టిక్‌టాక్‌ను ఎలన్ మస్క్ కొనేస్తున్నారా? ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:03 AM
అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్‌టాక్‌పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం వస్తోంది. ఈ నేషధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి.

చైనా (China)కు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok)పై పలు దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్‌టాక్‌కు నిషేధం ముప్పు పొంచి ఉంది. ఎంతో ఆదరణ పొందిన టిక్‌టాక్‌పై జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేషథ్యంలో నిషేధం ముప్పు నుంచి తప్పించుకునేందుకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ ప్లాన్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ అమెరికా కార్యకలపాలను పూర్తిగా ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ (Elon Musk)కు అమ్మెయ్యాలని బైట్ డ్యాన్స్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి (Ban on TikTok).
టిక్‌టాక్‌ను కొనడం గురించి కొద్ది రోజుల క్రితం ఎలన్ మస్క్ మాట్లాడిన వీడియోను ఓ జర్మనీ వార్తా సంస్థ తాజాగా బయటపెట్టింది. టిక్‌టాక్‌ను కొనే యోచన తనకు లేదని మస్క్ స్పష్టం చేశారు. ``నాకు టిక్‌టాక్‌ను కొనాలనే ఆలోచన లేదు. టిక్‌టాక్ కోసం నేను బిడ్డింగ్ వేయలేదు. ఒకవేళ కొన్నా ఏం చేయాలనే ప్రణాళిక మా దగ్గర లేదు. కంపెనీలను కొనడం కంటే.. కొత్తగా నెలకొల్పడమే నాకు ఎక్కువ ఇష్టం`` అంటూ మస్క్ పేర్కొన్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టిక్‌టాక్ వినియోగంపై నిషేధాలను అమలు చేస్తున్నాయి. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే టిక్‌టాక్ నిషేధాన్ని ఎదుర్కోక తప్పదనే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఆమోదం తెలిపింది.
సంస్థ జాయింట్ వెంచర్‌లో అమెరికాకు 50 శాతం వాటా ఇస్తే టిక్‌టాక్‌కు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ సన్నిహితుడైన మస్క్‌కే టిక్‌టాక్‌ను అమ్మెయ్యాలని బైట్ డ్యాన్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2017లో ప్రారంభమైన టిక్‌టాక్ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. అంతే వేగంగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాల్లో టిక్‌టాక్‌పై నిషేధాలు మొదలయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..