Electric Bus Services Launched: పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:28 AM
Electric Bus Services Launched in Puducherry by Olectra Greentech
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒలెకా్ట్ర విద్యుత్ బస్సుల సేవలు ప్రారంభమయ్యాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) తయారు చేసిన 25 ఎలక్ట్రిక్ బస్సులను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కే కైలాశ్‌నాథన్, ముఖ్యమంత్రి రంగసామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో 12 సంవత్సరాల పాటు నడిపించడంతో పాటు వాటి నిర్వహణను చేపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More AP News And Telugu News