Share News

ED Asset: ఈడీ జప్తు చేసిన ఆస్తుల విడుదల కుదరదు

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:57 AM

జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల సొమ్ముతో మజా చేసే ఘరానా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది....

ED Asset: ఈడీ జప్తు చేసిన ఆస్తుల విడుదల కుదరదు

ఎన్‌సీఎల్‌ఏటీ

న్యూఢిల్లీ: జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులు, ఆర్థిక సంస్థల సొమ్ముతో మజా చేసే ఘరానా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది. దివాలా చట్టాన్ని (ఐబీసీ) అడ్డుపెట్టుకుని అక్రమ నగదు లావాదేవీల చట్టం (పీఎంఎల్‌ఏ) నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఐబీపీ పరిష్కార ప్రక్రియలోకే రావని ప్రకటించింది.

ఇదీ కేసు: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయిన డునార్‌ ఫుడ్స్‌ కంపెనీ నుంచి తమకు రావలసిన రూ.758.73 కోట్లు రాబట్టుకునేందుకు ఎస్‌బీఐ నాయకత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ లోపు పీఎల్‌ఏ చట్టం కింద డునార్‌ ఫుడ్స్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దాంతో ఈ ఆస్తులను విడిపించాలని ఎన్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్‌ను ఆ కంపెనీ కోరింది. కేసును విచారించిన ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఈడీ చర్యను సమర్ధిస్తూ డునార్‌ ఫుడ్స్‌ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో డునార్‌ ఫుడ్స్‌ కంపెనీ దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీకి అప్పీల్‌ చేసింది. కంపెనీకి ఎన్‌సీఎల్‌ఏటీలోనూ చుక్కెదురైంది. ఈ తీర్పు ఐబీసీని అడ్డుపెట్టుకుని బ్యాంకుల అప్పులతో మజా చేసే మాయగాళ్లకు చెంప పెట్టని భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

మదుపరులూ పారాహుషార్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jul 07 , 2025 | 04:18 AM