పుల్‌బ్యాక్ ర్యాలీకి చాన్స్
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:41 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గత వారం వరుసగా పతనమవటంతో ఈసారి పుల్‌బ్యాక్ లేదా కౌంటర్ ర్యాలీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆదేశాలపై స్పష్టత...

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గత వారం వరుసగా పతనమవటంతో ఈసారి పుల్‌బ్యాక్ లేదా కౌంటర్ ర్యాలీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆదేశాలపై స్పష్టత వస్తే సూచీలు నిలకడగా సాగే వీలుంది. నిఫ్టీ మరోసారి కీలకమైన 22,900 స్థాయికి చేరుకుంది. సూచీకి ఇక్కడ బలమైన మద్దతు ఉంది. గత వారం అన్ని రంగాల షేర్లు పతనబాటలో సాగాయి. ప్రస్తుతం బ్యాంక్, ఫైనాన్స్, ఆటో, వినియోగ రంగాల షేర్లు కొంత పటిష్ఠతను సూచిస్తున్నాయి. అయితే సూచీలు స్థిరపడేంత వరకు మదుపరులు అప్రమత్తంగా ఉండటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
హెచ్‌సీఎల్ టెక్: డిసెంబరు త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ కౌంటర్‌లో కరెక్షన్ జరిగింది. జీవితకాల గరిష్ఠం నుంచి 18 శాతం వరకు పతనమయ్యాయి. ప్రస్తుతం కీలకమైన రూ.1,700 స్థాయిలో బేస్ ఏర్పడుతోంది. ఇప్పటికే రిలేటివ్ స్ట్రెంత్ బలంగానే ఉంది. గత శుక్రవారం రూ1,711 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,700/1,680 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,770/1,820 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,650 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎస్‌బీఐ కార్డ్: నష్టాల మార్కెట్‌లోనూ ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. జనవరి నుంచి అప్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. పైగా సెప్టెంబరు నాటి గరిష్ఠాన్ని బ్రేక్ చేసింది. రిలేటివ్ స్ట్రెంత్, డెలివరీ, వాల్యూమ్ సైతం పెరుగుతోంది. గత శుక్రవారం రూ.859 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.825/830 శ్రేణిలో ప్రవేశించి రూ.875/880 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.800 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కార్‌ట్రేడ్: మెరుగైన ఫలితాలు ప్రకటించటం, ఈపీఎస్ క్రమంగా పెరుగుతుండటంతో ఈ షేరుపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. పైగా ఐపీఓ నాటి స్థాయిని బ్రేక్ చేయటం, రిలేటివ్ స్ట్రెంత్ పెరగటం శుభపరిణామాలు. గత శుక్రవారం రూ.1,567 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,550/1,530 శ్రేణిలో ప్రవేశించి రూ.1,665 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,500 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
గాడ్‌ఫ్రే ఫిలిప్స్: జీవితకాల గరిష్ఠం నుంచి 50 శాతం వరకు పతనమైన ఈ షేరు మళ్లీ పుంజుకుంటోంది. రూ.4,200 స్థాయి నుంచి టర్న్ అరౌండ్ అయ్యాయి. ఈపీఎస్, సేల్స్ బాగా పెరిగాయి. ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.5,999 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.5,850 వద్ద పొజిషన్ తీసుకుని రూ.6,250/6,300 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.5,800 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
హిందాల్కో: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ షేరు 27 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. ప్రస్తుతం ఈ షేరు కీలకమైన మద్దతు స్థాయి వద్ద టర్న్ అరౌండ్ అయ్యింది. ప్రైస్ యాక్షన్ టైట్‌గా జరుగుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.606 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.590/580 స్థాయిలో ప్రవేశించి రూ.660/675 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.550 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..