Share News

అప్పు చేయకపోయినా క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా?

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:31 AM

అప్పు చేసి తిరిగి చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. కానీ, ఇంతవరకు రుణం తీసుకోకపోయినా మీ క్రెడిట్‌ స్కోర్‌...

అప్పు చేయకపోయినా క్రెడిట్‌ స్కోర్‌ తక్కువగా ఉందా?

అప్పు చేసి తిరిగి చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. కానీ, ఇంతవరకు రుణం తీసుకోకపోయినా మీ క్రెడిట్‌ స్కోర్‌ చాలా తక్కువగా ఉందా..? అందుకు కారణాలేంటో తెలుసుకుందాం..

క్రెడిట్‌ హిస్టరీ లేకపోవడం

ఇప్పటివరకు మీరు రుణం తీసుకోలేదు, క్రెడిట్‌ కార్డు కూడా వాడటం లేదనుకోండి.. క్రెడిట్‌ బ్యూరోల వద్ద మీ డేటా ఉండకపోవడం వల్ల స్కోర్‌ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా యువతీ యువకులు, విద్యార్థులు, సదా నగదు లేదా డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేపట్టే వారి స్కోర్‌ తక్కువగా ఉంటుంది.

క్రియారహిత క్రెడిట్‌ కార్డు

మీరు క్రెడిట్‌ కార్డు తీసుకున్నారు. కానీ దాన్ని వినియోగించకపోతే మీ రుణ నిర్వహణ తీరుపై క్రెడిట్‌ బ్యూరోలకు సమాచారం ఉండదు. కాబట్టి, క్రియారహిత క్రెడిట్‌ కార్డు కారణంగా మీ స్కోర్‌ తగ్గకపోయినప్పటికీ పెరగడం మాత్రం జరగదు.


రుణ తిరస్కరణ

మీరు గతంలో క్రెడిట్‌ కార్డు లేదా వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైన పక్షంలోనూ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. అయినప్పటికీ, అది తాత్కాలికమే.

తక్కువ క్రెడిట్‌ హిస్టరీ

క్రెడిట్‌ స్కోర్‌ ఆల్గోరిథమ్స్‌ సుధీర్ఘ క్రెడిట్‌ హిస్టరీ కలిగిన వారికి ప్రాధాన్యమిస్తాయి. మీరు ఈ మధ్య కాలంలోనే క్రెడిట్‌ కార్డు లేదా ఏదైనా రుణ సాధనాన్ని తీసుకున్నారనుకోండి.. తొలుత మీ స్కోర్‌ తక్కువగానే ఉంటుంది. ఆపై మీ రుణ నిర్వహణ తీరును బట్టి స్కోర్‌ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

క్రెడిట్‌ నివేదికలో తప్పులు

ఇతర వ్యక్తుల వ్యక్తిగత రుణం లేదా ఆలస్య చెల్లింపుల వివరాలు పొరపాటున మీ క్రెడిట్‌ రిపోర్టులో చేర్చిన పక్షంలోనూ స్కోర్‌ తగ్గే ప్రమాదం ఉంది.


క్రెడిట్‌ మిక్స్‌ లేకపోవడం

సాధారణంగా ఒకే రుణ సాధనం కలిగిన వారి స్కోర్‌ తక్కువగానే ఉంటుంది. క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణం.. ఇలా భిన్న రుణ సాధనాలను ఉపయోగించుకోవడంతో పాటు వాటి నిర్వహణ తీరు బాగుంటే భవిష్యత్‌లో స్కోర్‌ పెరిగేందుకు అవకాశం ఉంటుంది.

క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతానికి

మించి వినియోగం

మీకు క్రెడిట్‌ కార్డు ఉంటే, తరచుగా దాని పరిమితిలో 30 శాతానికి మించి వినియోగించుకుంటున్నట్లయితే, సకాలంలోనే బిల్లు చెల్లించినప్పటికీ క్రెడిట్‌ స్కోర్‌ తగ్గుతుంది. ఎందుకంటే, మీరు జీవితంలో రుణాలపైనే అధికంగా ఆధారపడుతున్నారడానికి అది సంకేతం.

జాయింట్‌ అకౌంట్స్‌

ఇతర వ్యక్తి రుణానికి మీరు సహ-సంతకందారు లేదా హామీదారుగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి రుణం చెల్లింపులో విఫలమైతే తనతో పాటు మీ క్రెడిట్‌ స్కోర్‌ కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

EPFO: కొత్త అప్‎డేట్ .. ​EDLI స్కీం ద్వారా మరిన్ని ప్రయోజనాలు


iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్


BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 09 , 2025 | 03:31 AM