Divis Q1 Results: దివీస్ లాభం రూ 545 కోట్లు
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:16 AM
దివీస్ లాభం రూ.545 కోట్లు వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి దివీస్ లేబరేటరీస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేక పోయాయి. ఈ కాలానికి కంపెనీ రూ.2,410 కోట్ల ఆదాయంపై రూ.756 కోట్ల స్థూల...
దివీస్ లాభం రూ.545 కోట్లు వర్తమాన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి దివీస్ లేబరేటరీస్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేక పోయాయి. ఈ కాలానికి కంపెనీ రూ.2,410 కోట్ల ఆదాయంపై రూ.756 కోట్ల స్థూల లాభం, రూ.545 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 14 శాతం, స్థూల లాభం 16.3 శాతం, నికర లాభం 27 శాతం పెరిగాయి. అయితే మార్కెట్ వర్గాలు ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.2,437 కోట్ల ఆదాయంపై రూ.794.8 కోట్ల స్థూల లాభం, రూ.573.25 కోట్ల వరకు నికర లాభం నమోదు చేస్తుందని అంచనా వేశాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ స్థూల లాభ శాతం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.7 శాతం పెరిగి 31.4 శాతానికి చేరింది. క్యూ1 ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బుధవారం బీఎ్‌సఈలో దివీస్ షేర్లు 4.29 శాతం నష్టపోయి రూ.6,134.25 వద్ద ముగిశాయి.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి