GST Rate Cut Impact: రూ 11 లక్షల కోట్లు
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:36 AM
జీఎ్‌సటీ రేట్లు తగ్గడంతో వినియోగదారుల్లో కొనుగోళ్ల ఉత్సా హం వెల్లివిరిసింది. ఆర్‌బీఐ తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. జీఎస్‌టీ రేట్లు తగ్గిన తొలి రోజున (ఈ నెల 22న) దేశంలో డిజిటల్...
తగ్గిన జీఎ్‌సటీ రేట్లు అమల్లోకి వచ్చిన
తొలి రోజు జరిగిన డిజిటల్ చెల్లింపులివి..
న్యూఢిల్లీ: జీఎ్‌సటీ రేట్లు తగ్గడంతో వినియోగదారుల్లో కొనుగోళ్ల ఉత్సా హం వెల్లివిరిసింది. ఆర్‌బీఐ తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. జీఎస్‌టీ రేట్లు తగ్గిన తొలి రోజున (ఈ నెల 22న) దేశంలో డిజిటల్ చెల్లింపులు ఏకంగా రూ.11 లక్షల కోట్లకు పెరిగాయి. అంతక్రితం రోజు (ఈనెల 21)న నమోదైన రూ.1.1 లక్షల కోట్ల డిజిటల్ పేమెంట్స్‌తో పోలిస్తే దాదాపు 10 రెట్లు అధికమయ్యాయి.
డిజిటల్ చెల్లింపులు ఈ మార్గాల్లో ..
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ)
నేషనల్ ఎలకా్ట్రనిక్స్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్)
రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్)
ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీసెస్ (ఐఎంపీఎస్)
డెబిట్, క్రెడిట్ కార్డులు
25% పెరిగిన ఈ-కామర్స్ విక్రయాలు: మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం.. జీఎ్‌సటీ తగ్గిన తొలి రెండు రోజుల్లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయాలు 23-25 శాతం మేర పెరిగాయి. ఈ-కామర్స్ లావాదేవీల్లో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు దాదాపు 6 రెట్లు పెరిగి రూ.10,411 కోట్లకు, డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ 4 రెట్లు పెరిగి రూ.814 కోట్లకు చేరాయి.
ఎలా ఎంత
ఆర్‌టీజీఎస్ 8.2 లక్షల కోట్లు
నెఫ్ట్ 1.6 లక్షల కోట్లు
యూపీఐ 82,477 కోట్లు
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News