Deutsche Bank to Exit: భారత రిటైల్ బ్యాంకింగ్‌కు డాయిష్ బ్యాంక్ గుడ్‌బై
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:17 AM
భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్ ఆస్తులను విక్రయించాలని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి కలిగిన దేశీయ, అంతర్జాతీయ రుణదాతల నుంచి బిడ్లను కూడా..
ఆస్తుల విక్రయానికి బిడ్ల ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత్‌లో రిటైల్ బ్యాంకింగ్ ఆస్తులను విక్రయించాలని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి కలిగిన దేశీయ, అంతర్జాతీయ రుణదాతల నుంచి బిడ్లను కూడా ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డాయిష్ బ్యాంక్ మన దేశంలో 17 శాఖల ద్వారా రిటైల్ బ్యాంకింగ్ సేవలందిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్ విభాగ లాభాలను పెంచేందుకు ఈ ఏడాది అంతర్జాతీయంగా దాదాపు 2,000 ఉద్యోగాలకు కోత పెట్టడంతోపాటు బ్రాంచీల సంఖ్యను సైతం గణనీయంగా తగ్గించుకోనున్నట్లు డాయిష్ బ్యాంక్ సీఈఓ క్రిస్టియన్ సీవింగ్ ఈ మార్చిలో ప్రకటించారు. ఆ ప్రణాళిలో భాగంగానే భారత్ రిటైల్ బ్యాంకింగ్ నుంచి పూర్తిగా నిష్క్రమించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి