Cyient Semiconductors: సైయెంట్ సెమీ కండక్టర్స్‌తో నవిటాస్ భాగస్వామ్యం
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:10 AM
కొత్త తరం జీఏఎన్ టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి సంపూర్ణ జీఏఎన్ వ్యవస్థను నెలకొల్పడం లక్ష్యంగా నవిటాస్ సెమీ కండక్టర్ కార్పొరేషన్‌తో
హైదరాబాద్: కొత్త తరం జీఏఎన్ టెక్నాలజీని భారతదేశంలో ప్రవేశపెట్టి సంపూర్ణ జీఏఎన్ వ్యవస్థను నెలకొల్పడం లక్ష్యంగా నవిటాస్ సెమీ కండక్టర్ కార్పొరేషన్‌తో సైయెంట్ సెమీకండక్టర్స్ దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద రెండు కంపెనీలు డేటా సెంటర్లు, విద్యుత్ వాహనాలు, పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఎనర్జీ గ్రిడ్ మౌలిక వసతులు, పారిశ్రామిక విద్యుదీకరణ రంగాలకు అవసరం అయిన జీఏఎన్ ఉత్పత్తులను ఉమ్మడిగా అభివృద్ధి చేస్తాయి.
ఇవీ చదవండి:
ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్
ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి