Share News

ముడిచమురు ధరల తగ్గుదలతో

ABN , Publish Date - May 08 , 2025 | 04:28 AM

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల ట్రెండ్‌ కొనసాగితే భారత్‌కు ప్రయోజనకరమేనని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై...

ముడిచమురు ధరల తగ్గుదలతో

భారత్‌కు 1.8 లక్షల కోట్ల లబ్ధి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల తగ్గుదల ట్రెండ్‌ కొనసాగితే భారత్‌కు ప్రయోజనకరమేనని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై భారత్‌కు రూ.1.8 లక్షల కోట్ల మేర ఆదా కావచ్చని అంచనా వేసింది. భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు కూడా. దేశీయ ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత్‌ చమురు దిగుమతుల కోసం 24,240 కోట్ల డాలర్లు (రూ.20.60 లక్షల కోట్లు), ఎల్‌ఎన్‌జీ దిగుమతి కోసం 1,520 కోట్ల డాలర్లు (రూ.1.29 లక్షల కోట్లు) వెచ్చించింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర గురువారం ఒక దశలో 0.64 శాతం పెరుగుదలతో 62.55 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో క్రూడాయిల్‌ 60-70 డాలర్ల స్థాయికి పరిమితం కావచ్చని ఇక్రా భావిస్తోంది.

Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు

ఇంకా నగదే రారాజు

రూ 6 లక్షల కోట్లు ఆవిరి

Updated Date - May 08 , 2025 | 04:28 AM