Coforge Acquisition: కోఫోర్జ్ చేతికి ఎన్‌కోరా
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:10 AM
సిలికాన్ వేలీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐ కంపెనీ ఎన్‌కోరాలో నూరు శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్టు ఐటీ సర్వీసుల రంగంలోని కోఫోర్జ్ ప్రకటించింది....
న్యూఢిల్లీ: సిలికాన్ వేలీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐ కంపెనీ ఎన్‌కోరాలో నూరు శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్టు ఐటీ సర్వీసుల రంగంలోని కోఫోర్జ్ ప్రకటించింది. 235 కోట్ల డాలర్ల (రూ.21,133 కోట్లు) ఎంటర్‌ప్రైజ్ విలువకు డీల్ కుదిరినట్టు వెల్లడించింది. ఈ డీల్‌లో భాగంగా ఎన్‌కోరా ప్రస్తుత షేర్‌హోల్డర్లు, పెట్టుబడులు పెట్టిన పీఈ దిగ్గజాలు ఆడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్‌బర్గ్ పింక్‌సలకు కోఫోర్జ్ 189 కోట్ల డాలర్ల విలువ గల ప్రిఫరెన్షియల్ షేర్లు జారీ చేస్తుంది. ఈ మేరకు తాము ఒక ఒప్పందంపై సంతకం చేసినట్టు కోఫోర్జ్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్‌తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి